ప‌ని రాక్ష‌సుల నుంచి ట్రిక్స్ మాత్ర‌మే ప‌ట్టుకుంటుంది!

సినీ ఇండస్ట్రీలో వారసులకు అవకాశాలు రావడం సులభమే. కానీ తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడం మాత్రం అంత సుల‌భం కాదు.;

Update: 2026-03-23 05:48 GMT

సినీ ఇండస్ట్రీలో వారసులకు అవకాశాలు రావడం సులభమే. కానీ తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడం మాత్రం అంత సుల‌భం కాదు. ఈ విషయంలో శ్రుతి హాసన్ ఎప్పుడూ తనదైన శైలిలో దూసుకుపోతోంది. తాజాగా ఆమె తన తండ్రి కమల్ హాసన్, సూపర్ స్టార్ రజనీకాంత్ల గురించి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. కెరీర్ పరంగా తాను ఎప్పుడూ వారిద్దరినీ సలహాలు అడగలేదని అసలు ఆ ప్రయత్నమే చేయలేదని అమ్మ‌డు కుండబ బద్దలు కొట్టింది. బ‌సాధారణంగా స్టార్ కిడ్స్ తమ తండ్రి మార్గదర్శకత్వంలో అడుగులు వేస్తారు.

కానీ శ్రుతి మాత్రం తన తండ్రి కమల్ దగ్గరికి వెళ్లి నెక్స్ట్ ఏ సినిమా చేయాలి? నా కెరీర్ ను ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఏంటి? అని ఎప్పుడూ చర్చించలేదట. రజనీకాంత్ తో కూడా ఎంతో చ‌నువు ఉన్నా సరే ఆయన వద్దకు వెళ్లి కెరీర్ టిప్స్ అడిగే సాహసం చేయలేదంది. వృత్తిపరమైన నిర్ణయాలన్నీ తన సొంతంగానే తీసుకుంటానంది. ఒకవేళ తప్పులు జరిగినా ఆ బాధ్యత తనదేనని స్పష్టం చేసింది. సలహాలు తీసుకోకపోయినా ? వారిద్దరి నుంచి తాను కొన్ని `ట్రిక్స్` మాత్రం పట్టుకుంటానని శ్రుతి వెల్లడించింది. ముఖ్యంగా వారు పని చేసే విధానం తనను ఎంతగానో ఆశ్చర్యపరుస్తుందంది.

కమల్, రజనీలు ఇద్దరూ సెట్స్‌లో పని రాక్షసుల్లా శ్రమిస్తారని, ఆ క్రమశిక్షణే వారిని దిగ్గజాలుగా నిలబెట్టిందని చెప్పుకొచ్చింది. ఏమాత్రం విరామం లేకుండా? అలసట అనేది లేకుండా వారు పనిపై చూపించే శ్రద్ధే తనకు అసలైన పాఠమని పేర్కొంది. వారిద్దరూ తమ పనిని ఎంతో నిశ్శబ్దంగా ఎవరికీ ఇబ్బంది కలగకుండా పూర్తి చేస్తారంది. ఆ నిశ్శబ్ద పనితనం అనే ట్రిక్ తనకు ఎంతో నచ్చిందని శ్రుతి తెలిపింది. `నేను ఎంతో బిజీగా ఉన్నాను. నా మీద ఎంతో ఒత్తిడి ఉంది` అని వారు ఎప్పుడూ ప్రదర్శించరని, ఆ నిబ్బరాన్ని చూసి తాను చాలా నేర్చుకున్నానని చెప్పింది.

ఒక పక్క ఆఫీసులు, మరోపక్క ఫ్యామిలీ బాధ్యతలు నిర్వహిస్తూనే సెట్స్‌లో ఆ రేంజ్ ఎనర్జీ చూపించడం చిన్న విష‌యం కాదని కొనియాడింది. మొత్తానికి శ్రుతి హాసన్ వారసత్వ ఇమేజ్‌ను వాడుకోకుండా వారిలోని గొప్ప లక్షణాలను మాత్రమే అందిపుచ్చుకుని తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకునే ప్ర‌య‌త్న‌మే చేస్తుంది. రజనీకాంత్ న‌టించిన `కూలీ` చిత్రంలో శ్రుతి హాస‌న్ న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఆ సినిమా సెట్స్‌లో నేరుగా సూపర్ స్టార్ పని తీరును గమనిస్తూ మరిన్ని ట్రిక్స్ ప‌ట్టుకుంది. క‌మ‌ల్ తో క‌లిసి సినిమాలు చేసింది. అలా దిగ్గజాల మధ్య పెరిగినా? స్వయంకృషితోనే కెరీర్‌ను నిర్మించుకోవడంలో శ్రుతి సక్సెస్ అయిందని చెప్పొచ్చు.

Tags:    

Similar News