తారక్ కోసం చిరు సినిమా ఎంచుకున్న గురూజీ?

Update: 2020-03-05 08:15 GMT
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలు సూపర్ హిట్లు.. బ్లాక్ బస్టర్లు అవుతూ ఉంటాయి కానీ ఆయన సినిమా కథలకు మాత్రం ఎక్కడో ఒక చోట ప్రేరణ ఉంటుందని ఆరోపణలు కూడా వినిపిస్తూనే ఉంటాయి.  'అ ఆ' సినిమా 'మీనా' నవలను ఆధారంగా తీసుకుని తెరకెక్కించినదేనని అందరికీ తెలుసు.  'అజ్ఞాతవాసి' సినిమాకు ఫ్రెంచ్ సినిమా 'లార్గో వించ్' ఆధారం అని మనకే కాదు.. కొందరు ఫ్రెంచ్ జనాలకు కూడా తెలుసు.

అంతే కాదు. 'అల వైకుంఠపురములో' సినిమాకు ఆధారం 'ఇంటి గుట్టు' అని మరొకటి అని.. ఏదో ఒక సినిమా పేరు వినిపిస్తూనే ఉంది.  ఈ లిస్టు ఇంతటితో ఆగేలా లేదు.  ఎందుకంటారా?  'అల వైకుంఠపురములో' తర్వాత త్రివిక్రమ్ తన నెక్స్ట్ సినిమాను యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో చేస్తున్నారు.  ఈ సినిమాకు 'అయినను పోయి రావలె హస్తినకు' అనే టైటిల్ పరిశీలిస్తున్నారని టాక్ కూడా ఉంది.  ఈ సినిమాను మన గురూజీ పాత చిరంజీవి హిట్ సినిమా 'మంత్రిగారి వియ్యంకుడు' సినిమా ఆధారంగా తీయబోతున్నారని ఫిలిం నగర్ లో టాక్ వినిపిస్తోంది.

బాపు దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. అల్లు రామలింగయ్య మరో కీలక పాత్రలో నటించిన 'మంత్రిగారి వియ్యంకుడు' 1983 లో రిలీజైన సినిమా. అప్పట్లో సూపర్ హిట్ గా నిలిచింది.  కామెడీ.. ఎమోషన్స్.. ఫైట్స్.. సాంగ్స్ అన్ని సమపాళ్ళలో ఉండే సినిమా కావడంతో అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చింది. ఇప్పుడు గురూజీ ఈ సినిమా మూలకథనే ఎన్టీఆర్ సినిమాకు ప్రేరణగా తీసుకున్నారట.  అధికార దర్పంతో విర్రవీగే  మామకు హీరో బుద్ది చెప్పడమే సినిమా కథ.  ఈ సినిమాలో రాజకీయాలను ఎక్కువగా స్పృశించకుండా ఎంటర్టైన్మెంట్ పార్ట్ మాత్రమే ప్రధానంగా తీసుకోబోతున్నారట.  మరి ఈ గాసిప్పులు నిజమో కాదో తెలియాలంటే మాత్రం కొంత కాలం వేచి చూడక తప్పదు.


Tags:    

Similar News