మంగ్లీ పేరుతో మైక్రో ఫైనాన్స్.. పరువు తీసే ప్రయత్నం!
ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన గాత్రంతో శ్రోతలను అలరిస్తూ నేడు స్టార్ సింగర్ గా పేరు సొంతం చేసుకుంది.;
ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన గాత్రంతో శ్రోతలను అలరిస్తూ నేడు స్టార్ సింగర్ గా పేరు సొంతం చేసుకుంది. సినిమా పాటలతో భక్తి గీతాలతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న సింగర్ మంగ్లీ గత కొద్ది రోజులుగా మైక్రో ఫైనాన్స్ వివాదంతో సతమతమవుతున్న విషయం తెలిసిందే.. కొంతమంది ఈమె పేరును వాడుకొని డబ్బులు వసూలు చేశారన్నట్టు వార్తలు జోరుగా వినిపిస్తున్న నేపథ్యంలో.. తాజాగా దీనిపై ఒక ఎమోషనల్ పోస్ట్ పంచుకుంది మంగ్లీ. ముఖ్యంగా మైక్రో ఫైనాన్స్ పేరిట జరుగుతున్న మోసాలకు.. తనకు గానీ తన కుటుంబానికి గానీ ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.
మైక్రో ఫైనాన్స్ పేరుతో భారీ మోసం..
తాజాగా మంగ్లీ తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక సుదీర్ఘ నోటు పంచుకుంది.. "కొంతమంది మైక్రో ఫైనాన్స్ పేరిట నా పేరును ఉపయోగించి డబ్బులు వసూలు చేశారనే వస్తున్న వార్తలను ఖండిస్తున్నాను. నాకు ఆ వ్యక్తులకు , వాళ్లకు సంబంధించిన ఫైనాన్స్ వ్యాపారాలకు ఎటువంటి సంబంధం లేదు. నా ప్రొఫెషనల్ ఈవెంట్స్ కోసం నన్ను, నా తమ్ముడిని రోజూ చాలామంది సంప్రదిస్తూ ఉంటారు.. ఆ ఈవెంట్ కు సంబంధించిన ఇన్విటేషన్ వివరాల వరకే గానీ.. వాళ్ళ పర్సనల్ వ్యాపారాల గురించి నాకు, నా కుటుంబానికి ఏ మాత్రం సంబంధం లేదు. ఇలాంటి మోసపూరిత విషయాలలో నా పేరును వాడుకోవడం, నన్ను ఇన్వాల్వ్ చేయడం చాలా అన్యాయం . కావాలనే కొంతమంది నా వ్యక్తిగత పేరు, ప్రతిష్టకు భంగం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న కరెన్సీ కి సంబంధించిన వీడియోలకు మా ఇంటికి ఎటువంటి సంబంధం లేదు..
హెచ్చరించిన మంగ్లీ..
నా ప్రొఫెషన్ ఈవెంట్స్ మినహా నాకు ఎలాంటి వ్యాపారాలు లేవు. దయచేసి నా పేరు చెప్పి ఎవరైనా డబ్బులు వసూలు చేసినా మీరు నమ్మవద్దు. అలా మోసపోయిన వారికి న్యాయం చేయాలని పోలీస్ డిపార్ట్మెంట్ ను నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను " అంటూ మంగ్లీ చెప్పుకొచ్చింది. ఇక ఎవరైనా తన పేరును చెప్పి డబ్బులు వసూలు చేస్తే జాగ్రత్తగా ఉండాలి అని హెచ్చరించింది. ప్రస్తుతం మంగ్లీ షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాదు ఇన్ని రోజులు సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారానికి మంగ్లీ ఇచ్చిన ఈ క్లారిటీతో ఒక్కసారిగా చెక్ పడింది అని చెప్పవచ్చు.