యంగ్ హీరోకు ముందు నుయ్యి..వెనుక గొయ్యి!

ఇప్పుడు అదే అత‌ని కెరీర్‌కు శాపంగా మారుతోంద‌ట‌. తొంద‌ర‌ప‌డి ఏది ప‌డితే అది చేయ‌డానికి అడ్వాన్స్‌లు తీసుకోవ‌డంతో ఇప్ప‌డు అత‌నికి వ‌రుస ఫ్లాపులు ఎదుర‌వుతున్నాయి.;

Update: 2026-03-23 12:22 GMT

కొన్ని సార్లు తొంద‌ర‌పాటుతో తీసుకునే నిర్ణ‌యాలు జీవితాల్ని, కెరీర్‌ని త‌ల‌కిందులు చేస్తాయి. చేస్తున్న త‌ప్పుల్ని స‌రిదిద్దుకునే అవ‌కాశం ఉన్నా స‌రిదిద్దుకోలేక కొంత మంది సరెండ‌ర్ అయిపోవాల్సిన ప‌రిస్థితులు ఏర్ప‌డుతుంటాయి. దాని వ‌ల్ల ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న‌చందంగా ప‌రిస్థితి త‌యార‌వుతుంది. అచ్చం ఇలాంటి ప‌రిస్థితినే ఓ యంగ్ హీరో ఎదుర్కొంటున్నాడు. స‌క్సెస్‌లో ఉండ‌గా చేసిన త‌ప్పులే ఇప్పుడు అత‌న్ని వెంటాడుతున్నాయి. స‌క్సెస్‌లో ఉండ‌గా ఏ ప్రొడ్యూస‌ర్ అడ్వాన్స్ ఇచ్చినా కాద‌న‌కుండా తీసేసుకున్నాడు.

ఇప్పుడు అదే అత‌ని కెరీర్‌కు శాపంగా మారుతోంద‌ట‌. తొంద‌ర‌ప‌డి ఏది ప‌డితే అది చేయ‌డానికి అడ్వాన్స్‌లు తీసుకోవ‌డంతో ఇప్ప‌డు అత‌నికి వ‌రుస ఫ్లాపులు ఎదుర‌వుతున్నాయి. దీంతో ఫ్లాపుల నుంచి త‌ప్పించుకుని స‌క్సెస్‌ని సొంతం చేసుకోవాల‌ని తీసుకున్న అడ్వాన్సుల్లో కొన్ని తిరిగి ఇచ్చేయాల‌ని భావించినా ఇవ్వ‌డానికి డ‌బ్బు లేదు. దీంతో చేసేది లేక స‌ద‌రు హీరో న‌చ్చినా..న‌చ్చ‌క‌పోయినా అడ్వాన్స్ తీసుకుని అంగీక‌రించిన సినిమాల‌ని సైలెంట్‌గా కంప్లీట్ చేయాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నాడ‌ట‌.

గ‌తంలో ఇచ్చిన అడ్వాన్స్‌ల‌తో కావాల్సిన జ‌ల్సాలు, ప్రాప‌ర్టీలు కొనేసిన, వాటి కోసం పైగా అప్పులు చేసిన స‌ద‌రు హీరో గాళ్‌ ఫ్రెండ్ కోసం భారీ మొత్తంలోనే ఖ‌ర్చు చేశాడ‌ట‌. దీంతో న‌చ్చ‌ని ప్రాజెక్ట్‌ని ప‌క్క‌న పెట్టాల‌నుకున్నా తీసుకున్న అడ్వాన్స్‌లు తిరిగి ఇవ్వ‌లేని ప‌రిస్థితి. దీంతో చేసేది లేక సినిమా ఫ్లాప్ అవుతుంద‌ని తెలిసినా నోరు మూసుకుని చేసే స్తున్నాడ‌ట‌. గ‌త కొంత కాలంగా అందిన కాడికి ప్రాప‌ర్టీస్ కోసం అప్పులు చేసిన స‌ద‌రు హీరో ఇప్పుడు వాటిని క్లియ‌ర్ చేసుకునే ప‌నిలో ఉన్నాడ‌ట‌.

స‌క్సెస్ కోసం గ‌త కొంత కాలంగా ఎదురు చూస్తున్న స‌ద‌రు హీరో ఈ సారి ఎలాగైనా సూప‌ర్ హిట్‌ని త‌న ఖాతాలో వేసుకోవాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్న‌ట్టుగా తెలిసింది. ఆ కార‌ణంగానే బుద్దిగా షూటింగ్‌లు చేసుకుంటూ పార్టీలు, ప‌బ్బుల‌కు, ప్రైవేట్ పార్టీల‌కు దూరంగా ఉంటున్నాడ‌ట‌. గ‌తంతో పోలిస్తే కెరీర్‌పై సీరియ‌స్‌గా ఉన్న స‌ద‌రు హీరో అనుకున్న స‌మ‌యానికి అనుకున్న‌ట్టుగా సినిమాల‌ని పూర్తి చేయాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్నార‌ట‌. అంతా అనుకున్న‌ట్టుగా స‌ద‌రు హీరో స‌క్సెస్ సాధిస్తే కెరీర్ మ‌రింత మ‌లుపు తిరుగుతుంది. అదే ఫ్లాప్ వ‌స్తే చాలా వ‌ర‌కు ఇండ‌స్ట్రీలో కానీ వెన‌క‌బ‌డిపోవ‌డం ఖాయం అనే కామెంట్‌లు వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News