పెద్ది వ‌స్తే సింహం త‌గ్గాల్సిందే! క్లారిటీ ఇచ్చేసిన దిల్ రాజు

టాలీవుడ్‌లో వినూత్న కథనాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న డైరెక్ట‌ర్ కం యాక్ట‌ర్ త‌రుణ్ భాస్క‌ర్ దాస్యం మ‌రో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టుతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు.;

Update: 2026-03-23 10:57 GMT

టాలీవుడ్‌లో వినూత్న కథనాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న డైరెక్ట‌ర్ కం యాక్ట‌ర్ త‌రుణ్ భాస్క‌ర్ దాస్యం మ‌రో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టుతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు. పెళ్లి చూపులు, ఈ న‌గ‌రానికి ఏమైంది సినిమాల‌తో డైరెక్ట‌ర్ గా ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న త‌రుణ్, డైరెక్ట‌ర్ గానే కాకుండా న‌టుడిగానూ త‌న ప్ర‌త్యేక‌శైలిని నిరూపించుకుంటున్నారు. అందులో భాగంగానే త‌రుణ్ హీరోగా గాయ‌ప‌డ్డ సింహం అనే సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు.

రిలీజ్ హ‌క్కుల్ని సొంతం చేసుకున్న దిల్ రాజు

ఈ సినిమాకు కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వం వహించగా, ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ముఖ్యంగా, సెన్సిటివ్ కథలతో గుర్తింపు పొందిన డైరెక్ట‌ర్ పవన్ సాధినేని ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరించడం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. కళ్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప్, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ ఈ సినిమాను నిర్మిస్తుండ‌గా, ఆల్రెడీ రిలీజైన ట్రైజ‌ర్ కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు రిలీజ్ చేయ‌నుండ‌గా, తాజాగా మేక‌ర్స్ ఈ మూవీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తూ ప్రెస్‌మీట్ ను నిర్వ‌హించారు.

ఎవ‌రికీ కౌంట‌ర్ కాదు

ఈ ఈవెంట్ లో టైటిల్ గురించి మేక‌ర్స్ కు ఓ ఇంట్రెస్టింగ్ ప్ర‌శ్న ఎదురైంది. గాయ‌పడ్డ సింహం అనే టైటిల్ సెటైరిక‌ల్ గా ఉంది. దాన్ని ఎవ‌రినైనా టార్గెట్ చేస్తూ పెట్టారా అనే ప్ర‌శ్న‌ల‌కు ప‌వ‌న్ సాదినేని క్లారిటీ ఇచ్చారు. టైటిల్ వెనుక ఎలాంటి కౌంట‌ర్లు లేవ‌ని, సినిమా చూశాక అస‌లు దీనికి ఆ టైటిల్ ను ఎందుకు పెట్టార‌నేది క్లారిటీ వ‌స్తుంద‌ని ఆయ‌న వెల్ల‌డించారు.

మే 1న గాయ‌ప‌డ్డ సింహం రిలీజ్

ఇక సినిమా రిలీజ్ డేట్ విష‌యానికొస్తే గాయ‌ప‌డ్డ సింహం మూవీ మే 1న రిలీజ్ కానున్న‌ట్టు మేక‌ర్స్ అనౌన్స్ చేశారు. అదే టైమ్ కు ఏప్రిల్ 30న రామ్ చ‌ర‌ణ్ పెద్ది సినిమా వ‌ర‌ల్డ్ వైడ్ గా రిలీజ్ కు రెడీ అవుతుంది. ఈ నేప‌థ్యంలో థియేటర్ల లభ్యతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు మాట్లాడారు. పెద్ది గ్రాండ్ రిలీజ్ అవుతున్న‌ప్పుడు మే 1కి మేమే థియేట‌ర్లు ఇవ్వ‌లేమ‌ని, అప్పుడు మ‌ళ్లీ దిల్ రాజునే జ‌నాలు తిడతార‌ని, ముందే ఈ విష‌యాన్ని నిర్మాత‌ల‌కు చెప్పాన‌ని, కండిష‌న్స్ అప్లై అనే ష‌ర‌తుతోనే మేక‌ర్స్ మే 1 రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారని, అవ‌స‌ర‌మైతే రిలీజ్ డేట్ ను మార్చుకోవాల‌ని కూడా చెప్పాన‌ని, ఇప్పుడు ప్ర‌మోష‌న్స్ కోసం రిలీజ్ డేట్ అవ‌స‌రం కాబ‌ట్టి అందులో భాగంగా ఈ డేట్ ను అనౌన్స్ చేశార‌ని, ప‌రిస్థితులు అనుకూలించ‌క‌పోతే ఓ వారం సినిమా వెన‌క్కి వెళ్లే అవ‌కాశాలు కూడా ఉంటాయ‌ని దిల్ రాజు చెప్పారు. అంటే దిల్ రాజు ఈ సినిమా వాయిదా గురించి క్లారిటీ ఇవ్వ‌క‌నే ఇచ్చేశారు.

Tags:    

Similar News