త్రివిక్రమ్ నెక్స్ట్ మూవీలో హీరో ఎన్టీఆర్ కాదా..?

Update: 2020-04-27 17:30 GMT
టాలీవుడ్ లో ఎన్టీఆర్-త్రివిక్రమ్ ల కాంబినేషన్లో వచ్చిన అరవింద సమేత సినిమా 2018 సంవత్సరంలోని బ్లాక్ బస్టర్ లలో ఒకటి. అరవింద సమేత ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో.. అందరికి తెలిసిందే. మాటల మాంత్రికుడు ఎన్టీఆర్ కలిస్తే ఆ మ్యాజిక్ వేరు. ఎన్టీఆర్ నుండి కొత్తరకం బాడీ లాంగ్వేజ్ - డైలాగ్స్ పలికించిన ఘనత త్రివిక్రమ్ కి చెందుతుంది. ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్ రాజమౌళి 'ఆర్ ఆర్ ఆర్' సినిమాతో బిజీ అయిపోయాడు.

త్రివిక్రమ్ అల్లు అర్జున్ తో కలిసి 'అల వైకుంఠపురంలో' సినిమాతో ఈ ఏడాది సంక్రాంతికి భారీ విజయాన్ని నమోదు తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే త్రివిక్రమ్ తదుపరి సినిమా ఎన్టీఆర్ తోనే తెరకెక్కించనున్నాడు. ఎన్టీఆర్ కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తి చూపిస్తున్నాడట. వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేయాలనుకుంటున్న ఈ సినిమాకు 'అయినను పోయిరావలె హస్తినకు' అనే టైటిల్ ఖరారు చేశారు చిత్రబృందం. అయితే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు అవసరం అవుతారట. హీరోయిన్స్ గా జాన్వీ కపూర్ - నివేద పేతురాజ్ లను పరిశీలిస్తున్నారట.

అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా ఇప్పట్లో కుదిరే అవకాశాలు లేవట. ఎందుకంటే ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ సినిమా లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయిన విషయం తెలిసిందే. అయితే ఎన్టీఆర్ ఇంకా చాలా సమయాన్ని ఆర్ ఆర్ ఆర్ కోసం కేటాయించాల్సి ఉందట. ఈ నేపథ్యంలో చాలా గ్యాప్ వస్తుందని భావిస్తున్న త్రివిక్రమ్ ఈ గ్యాప్ లో మరో సినిమా తీద్దామని అనుకుంటున్నట్లు సమాచారం. అయితే ఎన్టీఆర్ కంటే ముందు రూపొందించే సినిమాలో ఎవరినీ హీరోగా తీసుకుంటారో అని ఆసక్తి నెలకొంది. ఈ విషయం పౌ అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Tags:    

Similar News