లీకుల వెనుక త్రివిక్రమ్ హస్తం
ఓ సినిమాకు టైటిల్ చాలా ముఖ్యం. జనాల్లోకి ఆ సినిమా థీమ్ ను చేరవేసేందుకు టైటిల్స్ కీలక పాత్ర పోషిస్తాయ్. కానీ తన చిత్రాలకు టైటిల్స్ పెట్టడంలో తను చాలా వీక్ అంటూ గతంలో త్రివిక్రమ్ ఓపెన్ గానే చెప్పాడు. మాటలతో మాయ చేసే ఈ దర్శకుడు.. ఓవరాల్ గా టైటిల్ ను నిర్ణయించడంలో మాత్రం నిజంగానే బలహీనత చూపిస్తూ ఉంటాడు.
మొదట్లో అతడు.. ఆ తర్వాత అత్తారింటికి దారేది చిత్రాలు మినహాయిస్తే.. టైటిల్ తోనే కట్టిపడేసిన మరొకటి కనిపించదు. రీసెంట్ గా అజ్ఞాతవాసి విషయంలో కూడా ముందు లీకులు వచ్చాయి. మెల్లగా జనాలకు టైటిల్ అలవాటు అయిపోయిన తర్వాత.. తీరిగ్గా అదే పేరును ప్రకటించడం మాంత్రికుడికి ఆనవాయితీ. ఇప్పుడు ఎన్టీఆర్ తో మూవీ చేస్తున్నాడు త్రివిక్రమ్. ఈ సినిమాకు 'అసామాన్యుడు' అనే పేరు ప్రచారంలోకి వచ్చింది. కొందరు బాగుందంటున్నారు.. కొందరు అబ్బే అనేస్తున్నారు. టీం మాత్రం మాకేం సంబంధం లేదనడం కూడా ఊహించే విషయమే.
కానీ అసలు త్రివిక్రమ్ అండ్ కో నుంచి లీకులు లేకుండా ఓ పేరు బైటకు వచ్చేస్తుందంటే నమ్మలేని విషయం. జనాల ఫీడ్ బ్యాక్ ను అనుసరించి.. టైటిల్ విషయంలో తుది నిర్ణయానికి వస్తుంటాడు త్రివిక్రమ్. ప్రస్తుతం అసామాన్యుడు విషయంలో త్రివిక్రమ్ టీం నుంచి ఇంకెన్ని టైటిల్స్ లీకుల రూపంలో వస్తాయో చూడాలి.