ఎట్టకేలకు సరిలేరునీకెవ్వరు మాట త్రివిక్రమ్‌ నోట

Update: 2020-02-18 14:07 GMT
సంక్రాంతికి విడుదలైన సరిలేరు నీకెవ్వరు.. అల వైకుంఠపురంలో చిత్రాలు ఢీ అంటే ఢీ అన్నట్లుగా బాక్సాఫీస్‌ వద్ద పోరాడాయి. రెండు సినిమాలు కూడా భారీ వసూళ్లను రాబట్టడంతో పాటు ఆయా హీరోల కెరీర్‌ లో బిగ్గెస్ట్‌ సక్సెస్‌ గా నిలిచాయి. అయితే ఈ రెంటిలో తమది పై చేయి అంటే తమది పై చేయి అంటూ రెండు సినిమాల యూనిట్‌ సభ్యులు పోస్టర్స్‌ రూపంలో పోటీ పడ్డారు. రెండు సినిమాల వారు కూడా ఇండస్ట్రీ హిట్‌ అంటూ వేసుకున్నారు.

సినిమాల మద్య కలెక్షన్స్‌ వార్‌ జరుగుతున్న నేపథ్యంలో ఈ సున్నితపు విషయమై మాట్లాడేందుకు ఆ సినిమా యూనిట్‌ సభ్యులు ఈ సినిమా యూనిట్‌ సభ్యులు ధైర్యం చేయలేదు. ఒకరి సినిమా గురించి ఒకరు కామెంట్‌ చేసుకునేందుకు కూడా ఆసక్తి చూపించలేదు. సినిమా విడుదలకు ముందు అల్లు అర్జున్‌ సరిలేరు నీకెవ్వరుకు శుభాకాంక్షలు తెలియజేశాడు. కాని త్రివిక్రమ్‌ మాత్రం సరిలేరు నీకెవ్వరు గురించి ఎక్కడ కూడా నోరు ఎత్తలేదు.

మహేష్‌ బాబుతో గతంలో మంచి స్నేహంను కలిగి ఉన్న త్రివిక్రమ్‌ ఇప్పుడు ఎందుకు ఎడమొహం పెడమొహం అన్నట్లుగా అయ్యాడంటూ పలువురు పలు రకాలుగా అనుమానాలు వ్యక్తం చేశారు. ఎన్నో విమర్శలు వచ్చిన తర్వాత మహేష్‌ బాబు సరిలేరు నీకెవ్వరు గురించి భీష్మ చిత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ సందర్బంగా మాట్లాడటం జరిగింది.

సరిలేరు నీకెవ్వరు చిత్రంతో ఇటీవలే సూపర్‌ హిట్‌ దక్కించుకున్న రష్మిక మరోసారి భీష్మ చిత్రంతో సక్సెస్‌ ను దక్కించుకుని సక్సెస్‌ జెర్నీని కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను అంటూ త్రివిక్రమ్‌ ఇన్నాళ్లకు సరిలేరు నీకెవ్వరు సినిమా సక్సెస్‌ అయ్యిందని ఒప్పుకున్నాడు. ఇప్పటికైనా తమ హీరో సినిమా గురించి త్రివిక్రమ్‌ మాట్లాడినందుకు కృతజ్ఞతలు అంటూ మహేష్‌ బాబు ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ చేస్తున్నారు.


Tags:    

Similar News