• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  త్రివిక్రమ్ - పూజాహెగ్డే...

త్రివిక్రమ్ - పూజాహెగ్డే లపై రెచ్చిపోతున్న మీమ్ రాయుళ్లు..!

By - Tupaki Desk
Update: 2021-08-10 15:30 GMT
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లో ఒకరైన త్రివిక్రమ్ శ్రీనివాస్ 'అ' అనే అక్షరంతో మొదలయ్యే టైటిల్ ను తన సినిమాలకు పెట్టడం సెంటిమెంట్ గా భావిస్తారని ఇండస్ట్రీలో అంటుంటారు. అదే సమయంలో హాలీవుడ్ సినిమాలు, ఓల్డ్ మూవీస్ నుంచి ఇన్స్పిరేషన్ గా తీసుకొని కథలు, సన్నివేశాలు రాస్తుంటారనే అపవాదు ఉంది. అలానే త్రివిక్రమ్ సినిమాలని పరిశీలిస్తే హీరోయిన్లను కూడా రిపీట్ చేస్తుంటారనే విషయం అర్థం అవుతుంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో '#SSMB28' అనే వర్కింగ్ టైటిల్ తో ఓ ప్రాజెక్ట్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సోమవారం మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రంలో హీరోయిన్ గా పూజా హెగ్డే ని ఫైనలైజ్ చేసినట్లు మేకర్స్ వెల్లడించారు. గతంలో మహేష్ తో 'మహర్షి' సినిమా చేసిన పూజా.. త్రివిక్రమ్ తో వర్క్ చేసే మూడో సినిమా ఇది. ఈ విషయం తెలిసినప్పటి నుంచి సోషల్ మీడియాలో త్రివిక్రమ్ - పూజా హెగ్డే లపై ఓ రేంజ్ లో మీమ్స్ పుట్టుకొస్తున్నాయి.

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పూజా హెగ్డే ఇంతకముందు 'అరవింద సమేత వీర రాఘవ' 'అల వైకుంఠపురములో' వంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. ఈ రెండు సినిమాలు మంచి సక్సెస్ అయ్యాయి. ఈ క్రమంలో ఇప్పుడు మూడోసారి ఆయన సినిమాలో బుట్టబొమ్మ నటిస్తోంది. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ - హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌ తో మూడోసారి జతకట్టడం గురించి పూజా హెగ్డే ట్వీట్ చేస్తూ "రౌండ్ 3.. లెట్స్ గో.." అని పేర్కొన్నారు మ్ దీంతో మీమ్ రాయుళ్లు రెచ్చిపోతున్నారు. తన స్కిల్స్ అన్నీ పెట్టి త్రివిక్రమ్ - పూజా లపై ఫన్నీ మీమ్స్ చేస్తూ వైరల్ చేసేస్తున్నారు.

త్రివిక్రమ్ ఇంతకముందు ఇలియానా - సమంత లను ఇలానే రిపీట్ చేశారు. 'జల్సా' 'జులాయి' చిత్రాల్లో గోవా బ్యూటీ హీరోయిన్ గా నటించగా.. 'అత్తారింటికి దారేది' 'సన్నాఫ్ సత్యమూర్తి' 'అ ఆ' చిత్రాల్లో సామ్ హీరోయిన్ గా చేసింది. నిజానికి త్రివిక్రమ్ - ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కాల్సిన #NTR30 లో పూజాహెగ్డే ని హీరోయిన్ గా అనౌన్స్ చేశారు. అయితే ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది. మరి హాసిని అండ్ హారిక వాళ్ళు అప్పుడు ఇచ్చిన అడ్వాన్స్ కు గానూ SSMB28 కోసం పూజాని తీసుకున్నారేమో.

నిజానికి డైరెక్టర్ కు తనసినిమాలో ఫీమేల్ లీడ్ ని ఎవ‌రితో చేయిస్తే బాగుంటుందో, కంఫ‌ర్ట్ గా ఉంటుందో చూసి నిర్ణ‌యం తీసుకునే స్వేచ్ఛ ఉంటుంది. సినిమా సక్సెస్ అవ్వాలంటే నటీనటులు దర్శకుడి మధ్య కంఫ‌ర్ట్ జోన్ చాలా ముఖ్యమనే విషయం తెలిసిందే. గత రెండు చిత్రాల్లో పూజా పర్ఫార్మన్స్ నచ్చడంతో త్రివిక్రమ్ మూడో అవకాశం ఇచ్చి ఉండొచ్చు. ఏదేమైనా SSMB28 ప్రాజెక్ట్ వల్ల త్రివిక్రమ్ - పూజా కలసి మీమ్ రాయుళ్లకు కావాల్సినంత స్టఫ్ ఇచ్చారని చెప్పవచ్చు.


Tags:    
  • Meem Pages 
  • Trolling 
  • Trivikram 
  • Pooja Hegde 

Similar News

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS