ఆ రీమేకును పక్కన బెట్టి మరీ..అలా!

Update: 2018-11-24 16:38 GMT
స్టైలిష్ స్టార్ నెక్స్ట్ సినిమా ఏంటనేది ఇప్పుడు టాలీవుడ్ హాట్ టాపిక్స్ లో ఒకటి. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో తన తదుపరి చిత్రాన్ని చేస్తాడని ఇప్పటికే వార్తలు వచ్చాయి. 'అరవింద సమేత' బాక్స్ ఆఫీస్ వద్ద విజయం సాధించడంతో తన నెక్స్ట్ సినిమాకు త్రివిక్రమ్ అయితే బాగుంటుందని బన్నీ డిస్కషన్స్ లో ఉన్న మిగతావన్నీ పక్కనబెట్టి త్రివిక్రమ్ ప్రాజెక్టుకు వోటేశాడట.

కానీ ఈ ప్రాజెక్టుకోసం బన్నీ ఒక హిందీ రీమేక్ ఎంచుకున్నాడని.. ఆ సినిమా అతనకు సరిగ్గా సూట్ అవుతుందని భావించి త్రివిక్రమ్ చెప్పడం జరిగిందట.  ఆ సినిమా వేరే ఏదో కాదు.. 'సోనూకే టిటూ కీ స్వీటీ'. ఈ ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్ అయిన ఈ బాలీవుడ్ చిత్రం ఫుల్ కామెడీ ఎంటర్టైనర్. కానీ ఇప్పుడు ఆ రీమేక్ సంగతి ఇప్పుడు ఇద్దరూ పక్క బెట్టేశారని తాజా సమాచారం. త్రివిక్రమ్ ఇప్పటికే బన్నీ కోసం ఒక కొత్త కథ అనుకున్నాడని ఇప్పుడు ఆ సింగిల్  లైన్ ను డెవలప్ చేసే పనిలో ఉన్నాడని సమాచారం.

ఈ కొత్త స్టొరీ ఫైనల్ వెర్షన్ నేరేషన్ డిసెంబర్ ఎండ్ లోపు ఇస్తాడని.. ఈ  సినిమా షూటింగ్ జనవరిలో స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట.  ఇదిలా ఉంటే.. బన్నీ త్రివిక్రమ్ సినిమా తో పాటుగా మరో సినిమాను ఒకే సారి సెట్స్ పైకి తీసుకెళ్ళాలని ప్లాన్ చేస్తున్నాడట.  ఇప్పటికే దీని కోసం కొత్త డైరెక్టర్ల కోసం అన్వేషణ సాగిస్తున్నాడట బన్నీ.  ఒక్కసారి అది కూడా ఫైనలైజ్ అయితే రెండూ సినిమాలు సెట్స్ పైపైకి వెళ్తాడట.  అంటే స్టైలిష్ స్టార్ ఫ్యాన్స్ కు డబల్ హంగామా రెడీ అయిపోండి.  
    

Tags:    

Similar News