ముదురు హీరోల‌తోనే ముదురు వేషాలా?

Update: 2020-05-02 04:02 GMT
మాట మార్చ‌డం .. పెద్ద ఆఫ‌ర్ వ‌స్తే చిన్న హీరోల‌కు కుంటి సాకులు చెప్పి త‌ప్పించుకోవ‌డం ఇవ‌న్నీ అందాల క‌థానాయిక‌ల‌కు అలవాటు వ్యాప‌కాలే. అయితే ఏదైనా త‌ప్పు చేయ‌ద‌లిస్తే నిర్మొహ‌మాటంగా వేరొక‌రిని (పీఆర్ లేదా మేనేజ‌ర్) బుక్ చేసి తాము సైడైపోతుంటారు. ఆ కోవ‌లోనే ప‌లువురు వెట‌ర‌న్ నాయిక‌లు పారితోషికాల కోసం పెద్ద హీరోల సినిమాల కోసం గ‌తంలో ఎన్నో త‌ప్పులు చేసిన సంద‌ర్భాలున్నాయి. ఒక ప్రాజెక్టుకి క‌మిటై వేరే పెద్ద ఛాన్స్ రాగానే అటు జంపైపోయేందుకు పెద్ద మిస్టేక్స్ చేసిన భామ‌లు మ‌న‌కు ఉన్నారు. క‌నిపించ‌రు కానీ.. మ‌న సీనియ‌ర్ భామ‌లంతా ఒక‌టే ముదురు టైపు అని గుస‌గుస‌లు ఉన్నాయి.

అందులో ఒక‌రిద్ద‌రిని ఎగ్జాంపుల్ గా తీస్కుంటే.. త్రిష‌- కాజల్ ముందు వ‌రుస‌లో ఉన్నార‌ని తాజాగా తేలింది. ఇంత‌కుముందు మెగాస్టార్ చిరంజీవి స‌ర‌స‌న ఆచార్య చిత్రానికి ఎంపికైన త్రిష స‌డెన్ గా ప్లేట్ ఫిరాయించింది. అందుకు కార‌ణ‌మేంటి? అంటే చిత్ర‌బృందంలో ఓ పెద్దాయ‌న‌తో స‌రిగా కుద‌ర‌లేద‌ని .. క్రియేటివ్ డిఫ‌రెన్సెస్ వ‌చ్చాయ‌ని ఏదో చెప్పుకుంది. దాంట్లో నిజం ఎంతో చిరునే ఆ త‌ర్వాత చెప్పార‌నుకోండి. అయితే త్రిష ఆ ప్రాజెక్టు నుంచి త‌ప్పుకోవ‌డానికి కార‌ణం వేరొక క్రేజీ ప్రాజెక్టులో ఆఫ‌ర్ రావ‌డ‌మే. అదేమిటా అన్న‌ది వెతికితే త‌న గురువుగారైన మ‌ణిర‌త్నం కి కాల్షీట్లు కేటాయించింద‌ట‌. అది కూడా ఓ భారీ హిస్టారిక‌ల్ సినిమాకి. మొత్తానికి త్రిష అలా ఆచార్య‌లో న‌టించ‌కుండా సైడైపోయింది. నిజానికి అప్ప‌టికే మెగాస్టార్ తో అగ్రిమెంటు జ‌ర‌గ‌లేదు కాబ‌ట్టి త్రిష‌కు ఆ అవ‌కాశం దొరికింది. ముదురు వేషాలు అయితే వేసిందన్న‌ది వాస్త‌వం.

ఆ త‌ర్వాత సీన్ లోకి ఎంట్రీ ఇచ్చిన కాజ‌ల్ ఏమైనా త‌క్కువ తిందా? అంటే.. అబ్బే.. స‌సేమిరా అనిపించే లాజిక్ ఒక‌టి ఆరా తీస్తే బ‌య‌ట‌పడింది. అప్ప‌టికే వేరొక హీరో సినిమాకి క‌మిటైన కాజ‌ల్ మెగాస్టార్ చిరంజీవి స‌ర‌స‌న ఆఫ‌ర్ అన‌గానే ఏం చేయాలో తోచ‌ని స‌న్నివేశంలోకి వెళ్లిపోయింది. పైగా పెద్ద బ్యాన‌ర్ .. పెద్ద పారితోసికం వ‌దులుకోవ‌డ‌మెలా? అన్న సందిగ్ధ‌త‌లో ప‌డిపోయింద‌ట‌. అయితే అప్ప‌టికే త‌మిళంలో యువ‌హీరో ఉద‌య‌నిధి స్టాలిన్ సినిమాకి క‌మిటైపోయి అడ్వాన్స్ కూడా తీస్కుంది. కాల్షీట్లు వేసేశారు. ఆ టైమ్ లో ఆ ప్రాజెక్టు నుంచి స్కిప్ కొడుతున్న‌ట్టు కాజ‌ల్ ప్ర‌క‌టించ‌డంతో షాక్ తిన్న ఉద‌య‌నిధి బ్యాచ్ త‌న‌ని లీగ‌ల్ గా బ్లాక్ చేశార‌ట‌. అడ్వాన్సులు తీసుకుని ఈ వేషాలేమిటి? అంటూ అక్క‌డ నిర్మాత‌ల మండ‌లిని సంప్ర‌దించి షంటేయ‌డంతో తిరిగి కాజ‌ల్ వెనుదిరిగి ఆలోచించాల్సి వ‌చ్చింద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. మొత్తానికి మ‌న భామ‌లేమీ ఎందులోనూ త‌క్కువ కాదు. ఇక ఇంత‌కుముందు శ్రుతిహాస‌న్ సైతం నాగార్జున‌-కార్తీ-పీవీపీల సినిమా ఊపిరికి చివ‌రి నిమిషంలో ఝ‌ల‌క్ ఇచ్చింది. త‌మిళంలో పెద్ద డైరెక్ట‌ర్ తో వేరొక క్రేజీ ఆఫ‌ర్ రావ‌డంతో పీవీపీ- ఊపిరికి ఝ‌ల‌క్ ఇచ్చి లీగల్ ట్ర‌బుల్ ఎదుర్కొంది. అదంతా స‌రే కానీ.. ఇప్పుడు త్రిష‌- కాజ‌ల్ త‌ప్పుకున్న త‌ర్వాత చిరంజీవి స‌ర‌స‌న ఆచార్య‌లో నాయిక‌గా ఎవ‌రిని ఎంపిక చేశారు? అంటే అందుకు సంబంధించిన అధికారిక స‌మాచారం రావాల్సి ఉందింకా.
Tags:    

Similar News