కాజోల్ ఫస్ట్ ఓటీటీ రిలీజ్ 'త్రిభంగా' ట్రైలర్..!
బాలీవుడ్ సీనియర్ నటి కాజోల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ''త్రిభంగా'' ఓటీటీ వేదికపై అలరించనుంది. ఆల్కేమీ ఫిల్మ్స్‌తో కలిసి కాజోల్ భర్త స్టార్ హీరో అజయ్ దేవగణ్ ఈ సినిమాను నిర్మించాడు. ఈ చిత్రానికి రేణుకా షహానే దర్శకత్వం వహించారు. నెట్ ఫ్లిక్స్ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ వేదికగా జనవరి 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ‘త్రిభంగా’ ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
‘త్రిభంగా’ ట్రైలర్ చూస్తుంటే ఒకే కుటుంబంలోని మూడు తరాల మహిళలు మధ్య చోటుచేసుకున్న సంఘటనల సమాహారమే ఈ సినిమా అని అర్థం అవుతోంది. ఇందులో కాజోల్ అనురాధ ఆప్టే అనే ఒడిస్సీ డ్యాన్సర్ పాత్రలో కనిపిస్తున్నారు. ఈ సినిమాలో కునాల్ రాయ్ కపూర్ - మిథిలా పాల్కర్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. అభంగా - సమభంగా - త్రిభంగా అనే ముగ్గురు మహిళల కథ ఏంటో తెలుసుకోవాలంటే సినిమా విడుదల అయ్యే వరకు ఆగాల్సిందే. 'త్రిభంగా' కాజోల్ కు ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ లో విడుదలవుతున్న తొలి చిత్రం అని చెప్పవచ్చు.
Full View