టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం.. కరోనాతో ప్రముఖ సింగర్ మృతి!
సినీ ఇండస్ట్రీలో కరోనా మహమ్మారి రోజురోజుకి విలయతాండవం చేస్తోంది. ఈ మహమ్మారి కారణంగా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఎల్లప్పుడూ సామాజిక దూరం పాటించినా కరోనా బారిన పడేవారి సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది. ఆ మధ్య లాక్డౌన్ సడలించి రెండు తెలుగు రాష్ట్రాలలో నిబంధనలతో కూడిన అనుమతులు జారీచేసాయి ప్రభుత్వాలు. లాక్‌డౌన్ సడలింపుల తర్వాత ఇండస్ట్రీలో కొన్ని సినిమాల షూటింగ్స్ కూడా కొన్నిరోజులు జరిగాయి. అదే సమయంలో కరోనా సెకండ్ వేవ్ వచ్చేసింది. మొత్తం దొరికింది ఛాన్స్ అన్నట్లుగా కరోనా బారినపడిన వారిని మృత్యు ఒడిలోకి చేర్చుతుంది.
ఇప్పటికే జాగ్రత్త కొద్దీ దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలు అవుతూనే ఉంది. తెలుగు రాష్ట్రాలలో కొన్ని రోజులుగా లాక్డౌన్ పరిమిత సమయపాలనతో అమలులో ఉంది. అయితే ఇదివరకే కరోనా భయంతో ముందే షూటింగ్స్ నిలిపేశారు మేకర్స్. ఇప్పుడు ఇండస్ట్రీలోని హీరో హీరోయిన్లతో పాటు సింగర్స్ పైన కరోనా టార్గెట్ చేసినట్లు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారిని కోల్పోయాం. నిర్మాతలు - దర్శకులు ఇలా అందరిని కోల్పోతూనే ఉంది టాలీవుడ్. తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. టాలీవుడ్ హీరో నవదీప్ నటించిన 'జై' సినిమాలోని'దేశం మనదే.. తేజం మనదే.. ఎగురుతున్న జండా మనదే..' అనే అద్భుతమైన పాటతో పాపులర్ అయ్యారు సింగర్ నేరేడుకొమ్మ శ్రీనివాస్ అలియాస్ 'జై' శ్రీనివాస్.
ఆయన గత కొద్దీరోజులుగా కరోనా బారినపడి సికింద్రాబాద్‌లోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. శ్రీనివాస్ కేవలం సినిమా పాటలే కాకుండా ఎన్నో దేశభక్తి గీతాలను పాడారు. తెలుగులో చాలా సూపర్ సిమాలకు శ్రీనవాస్ పాటలు పాడారు. అయితే సినిమా పాటలతోనే కాకుండా.. ప్రైవేట్ ఆల్బమ్స్ - షార్ట్ ఫిలిమ్స్ - వెబ్ సిరీస్ లలో పాటలకు కూడా ఆయన గాత్రం అందించారు. అలాంటి టాలెంటెడ్ సింగర్ మరణం గురించి వార్తలు తెలియగానే సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. అలాగే శ్రీనివాస్ మరణం పట్ల తెలంగాణ సీఎం కెసిఆర్ కూడా స్పందించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే శ్రీనివాస్ మరణం సినీరంగానికి తీరని లోటు అని ఆయన పేర్కొన్నట్లు సమాచారం.