ఏ రోజు ఖర్చు ఆరోజు లెక్క తేల్చే దర్శకుడు!
హిట్ మెషిన్ అనీల్ రావిపూడితో సినిమా అంటే నిర్మాతలు ఎంతో ధైర్యంగా ఉంటారు. నిర్మాతకు చెప్పిన బడ్జెట్ కంటే తక్కువలోనే పూర్తి చేసి ఔట్ పుడ్ ఇవ్వడం అనీల్ ప్రత్యేకత.;
హిట్ మెషిన్ అనీల్ రావిపూడితో సినిమా అంటే నిర్మాతలు ఎంతో ధైర్యంగా ఉంటారు. నిర్మాతకు చెప్పిన బడ్జెట్ కంటే తక్కువలోనే పూర్తి చేసి ఔట్ పుడ్ ఇవ్వడం అనీల్ ప్రత్యేకత. ఓ ప్రణాళిక ప్రకారం షూటింగ్ వేగంగా పూర్తి చేస్తాడు. ఒక్కసారి సినిమా సెట్స్ కు వెళ్లిందంటే? పని తప్ప మరో ధ్యాష లేకుండా తనతో పాటు టీమ్ అందర్నీ పరుగులు పెట్టిస్తాడు. ఈ క్రమంలో షూటింగ్ డేస్ తగ్గుతాయి. అనీల్ తో పనిచేస్తే ఎక్కడా అనవసరమైన ఖర్చు ఉండదు. ఎక్కడ ఖర్చు చేయాలి? ఎక్కడ తగ్గించాలి? అన్నది పక్కాగా తెలిసిన దర్శకుడు.
ఈ మాట స్వయంగా మెన్నటి రోజున మెగాస్టార్ చిరంజీవి అన్నారు. అంతకు ముందు వేడుకల్లో మరో నిర్మాత దిల్ రాజు కూడా అనీల్ గురించి ఇదే మాట చెప్పారు. నటీనటుల్ని పర్పెక్ట్ గా వినియోగించ గలిగితే? చాలా వరకూ షూటింగ్ డేస్ తగ్గుతా యి. నాలుగు రోజుల్లో చేయాల్సిన షూటింగ్ మూడు రోజుల్లో పూర్తి చేయగల్గితే లక్షల్లో ఆదా అవుతుంది. షూటింగ్ అంతా ఒక ఎత్తైతే పూర్తయిన తర్వాత ఆ ప్రోడక్ట్ ను జనాల్లోకి తీసుకెళ్లడం మరో ఎత్తు. ప్రచారం కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ అనీల్ తో ఆ సమస్య ఉండదు.
సినిమా ప్రచారాన్ని ఎంతో తెలివిగా నిర్వహిస్తాడు. నటీనటులు సెట్స్ లో ఉండగానే వాళ్లతోనే ప్రచారం నిర్వహిస్తాడు. షూటింగ్ పూర్తయిన తర్వాత నటీనటులు అందుబాటులోకి రావడం కష్టం. ఇది గమనించిన అనీల్ ముందుగానే వాళ్లతో సినిమాను జనాల్లోకి ఎలా తీసుకెళ్లాలో? ఓ ప్రణాళిక ముందే సిద్దం చేసి పెట్టుకుని రెడీగా ఉంటాడు. షూటింగ్ క్లైమాక్స్ కు చేరుకోగానే ప్రచారం మొదలు పెడతాడు. సోషల్ మీడియాని పర్పెక్ట్ గా వాడు కుంటాడు. ఒకటి రెండు , ప్రెస్ మీట్లు , ప్రీరిలీజ్ ఈవెంట్ తప్ప అవనసరమైన హడావుడి చేయడు.
ఇలా చేయడం వల్ల నిర్మాతకు పబ్లిసిటీ ఖర్చు తగ్గుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా అనీల్ గురించి మరో ఇంట్రె స్టింగ్ విషయం తెలిసింది. ఒక రోజు షూటింగ్ మొత్తానికి ఎంత ఖర్చు అయిందన్నది మొత్తం పీడీఎఫ్ రూపంలో ఆరోజు సాయంత్రానికి తన వాట్సాప్ కు లెక్క వచ్చేస్తుందిట. ఎన్ని రోజులు షూటింగ్ జరిగితే అన్ని రోజలు పక్కాగా ఫాలో అప్ ఉంటుంది. షూటింగ్ మొత్తంలో ఎక్కువ ఖర్చు ఏ జరిగిందో చూసుకుని ఆరోజు ఏ సన్నివేశాల తీసారో మళ్లీ క్రాస్ చెక్ చేసుకుంటాడుట. షూటింగ్ సంబంధించిన ఖర్చు అంతా ఇలా డైలీ చెక్ చేసుకోవడం వల్ల పాదర్శకత ఉంటుంది. నిర్మాతకు జవాబు దారీ తనంగానూ ఉంటుంది. ఎక్కడా అవనీతికి పాల్పడలేదు అని నిర్మాతకు ఓ నమ్మకం, భరోసా కల్పించినట్లు అవుతుంది.