టాప్ స్టోరి: మ‌హ‌మ్మారీని లెక్క చేయ‌ని డేరింగ్ స్టార్స్

Update: 2020-09-04 13:30 GMT
ఓవైపు సెట్స్ లో క‌రోనా సోకి ఆస్ప‌త్రుల పాల‌య్యార‌న్న వార్త‌ల‌తో ఆరంభం టాలీవుడ్ అట్టుడికిపోయింది. ప‌లువురు సీరియ‌ల్ న‌టీన‌టులు.. యాంక‌ర్లు .. సినిమా ఆర్టిస్టులకు క‌రోనా పాజిటివ్ వార్త‌ల‌తో భ‌య‌ప‌డిపోయారంతా. మ‌హామ‌హులు సైతం వెంటిలేట‌ర్ల‌పై చికిత్స పొందుతుంటే గుండె ఉగ్గ‌బ‌ట్టుకుని వెయిట్ చేసారంతా. కానీ ఎన్నాళ్ల‌ని ఈ స‌హ‌నం?

ఇప్ప‌టికే రామ్ చ‌ర‌ణ్ అస‌హ‌నం వెల్ల‌గ‌క్కారు. ఇది పోతుందో పోదో కానీ.. ఆగ‌లేక‌పోతున్నాం! ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ పూర్తి చేసేయాలి అన్న క‌సితో ఉన్నారు చ‌ర‌ణ్. కానీ ఆర్.ఆర్.ఆర్ కానీ ఆచార్య కానీ సెట్స్ కెళ్లేదెపుడో ఆయ‌న చెప్ప‌లేదు.

ప్ర‌భాస్ రాధే శ్యామ్ చిత్రీక‌ర‌ణ‌కు రంగం సిద్ధ‌మ‌వుతోంద‌ట‌. మ‌రోవైపు ఆదిపురుష్ కోసం నాగ్ అశ్విన్ కోసం అత‌డు ప్రిపరేష‌న్స్ సాగిస్తున్నారు. వైష్ణవ్ తేజ్ తన కొత్త చిత్రం కోసం రకుల్ ప్రీత్ తో షూటింగ్ ప్రారంభించింది అన‌గానే ఒక్కొక్క‌రుగా దిగొచ్చారు. కింగ్ నాగార్జున వ‌యసుకు కూడా లెక్క చేయ‌క బిగ్ బాస్ 4 షూట్ స‌హా వైల్డ్ డాగ్ షూటింగులో పాల్గొనేందుకు ఏర్పాట్లు చేసుకోవ‌డం షాకిచ్చింది. అల్లు అర్జున్ తన పుష్పాకు అటవీ నేపథ్యంలో పెద్ద సిబ్బంది అవసరం ఉన్నందున షూటింగ్ కోసం పరిస్థితి బాగుపడాలని ఇంకా వేచి చూస్తున్నార‌ట‌.

సాయి ధరం తేజ్ సెట్స్ పై తీవ్ర శ్రద్ధతో షూటింగ్ ‌కు తిరిగి వచ్చాడు. సుందీప్ కిషన్ హంక్ లుక్ తో తిరిగి సీన్ లో ఎంట‌ర‌య్యాడు. ఆది సాయికుమార్ కూడా సెట్స్ లో అడుగు పెట్టాడ‌ని స‌మాచారం.  నాగ చైతన్య మరియు శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ పెండింగ్ లో ఉన్న షూటింగ్‌ను తిరిగి ప్రారంభించడానికి సన్నద్ధమవుతున్నారు. ఆడివి శేష్ మేజర్ షూటింగ్ అతి త్వ‌రలో ప్రారంభించడానికి సన్నద్ధమవుతున్నారు. మ‌హ‌మ్మారీ వెంటాడిన ఇక‌పై భ‌య‌ప‌డేట్టు క‌నిపించ‌డం లేదు సీన్. ఒక్కొక్క‌రుగా డేర్ చేసి ప‌నుల‌కు సిద్ధ‌మ‌వుతున్నార‌న్న‌మాట‌.
Tags:    

Similar News