పెద్ది వల్ల ఇబ్బంది పడుతున్న అఖిల్ ఫ్యాన్స్
అయితే పెద్ది వల్ల ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్న సినిమా అఖిల్ లెనిన్. పెద్ది సినిమా ఏప్రిల్ 30న వస్తుందనే రీజన్ తో లెనిన్ ను వాయిదా వేశారు మేకర్స్.;
టాలీవుడ్‌లో భారీ సినిమాల రిలీజ్ డేట్స్ వరుసగా వాయిదా పడటం ఇండస్ట్రీలో చైన్ రియాక్షన్‌లా మారుతోంది. తాజాగా రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా మరోసారి వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సినిమా ముందుగా మార్చి 27న విడుదల కావాల్సి ఉండగా, షూటింగ్ ఆలస్యం కారణంగా ఏప్రిల్ 30కి పోస్ట్‌పోన్ చేశారు. అయితే ఇప్పుడు ఆ డేట్ కూడా సాధ్యం కాదనే టాక్ బలంగా వినిపిస్తోంది.
షూటింగ్ వల్లే ఆలస్యం
పెద్ది షూటింగ్ ఇంకా పూర్తి కాలేదని, ముఖ్యమైన సన్నివేశాలు మిగిలి ఉండటంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఆలస్యమవుతున్నాయని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. దర్శకుడు బుచ్చి బాబు సాన ఈ సినిమాను భారీ స్థాయిలో రూపొందిస్తున్నందున, క్వాలిటీ విషయంలో ఎలాంటి రాజీ పడకూడదనే ఉద్దేశంతో టీమ్ సమయం తీసుకుంటోందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త రిలీజ్ డేట్‌పై ఇంకా అధికారిక ప్రకటన రాకపోవడం ఇతర సినిమాలపై కూడా ప్రభావం చూపిస్తోంది.
పెద్ది వల్ల వెనక్కి వెళ్లిన లెనిన్
అయితే పెద్ది వల్ల ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్న సినిమా అఖిల్ లెనిన్. పెద్ది సినిమా ఏప్రిల్ 30న వస్తుందనే రీజన్ తో లెనిన్ ను వాయిదా వేశారు మేకర్స్. కానీ ఇప్పుడు పెద్ది వాయిదా పడింది. పెద్ది వాయిదా పడిందని ఇప్పుడు మళ్లీ లెనిన్ ఆ డేట్ కు వచ్చే పరిస్థితి లేదు. ఒకవేళ ఏదొకటి చేసి వద్దామన్నా, పెద్ది రిలీజ్ డేట్ విషయంలో మేకర్స్ క్లారిటీ ఇవ్వడం లేదు.
ఇక ఇదే సమస్య మరో రెండు సినిమాలపై కూడా ప్రభావం చూపుతోందని సమాచారం. పెద్ద సినిమాలు తమ రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేయకపోతే, చిన్న మరియు మధ్యస్థాయి సినిమాలు థియేటర్ల ప్లానింగ్ చేయడం కష్టమవుతోంది. ఫలితంగా మొత్తం రిలీజ్ క్యాలెండర్ అసమతౌల్యంగా మారుతోంది. మొత్తంగా చూస్తే, పెద్ది సినిమా వాయిదా టాలీవుడ్ రిలీజ్ ప్లానింగ్‌పై పెద్ద ఎఫెక్ట్ చూపిస్తోంది. రామ్ చరణ్ నుంచి అధికారిక క్లారిటీ వచ్చే వరకు ఈ అనిశ్చితి కొనసాగనుంది. ఇవన్నీ చూస్తూ అఖిల్ ఫ్యాన్స్ మాత్రం అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు తమ హీరో సినిమా వస్తుందా అని ఎదురుచూస్తున్న అక్కినేని అభిమానులకు ఎప్పటికప్పుడు నిరాశే ఎదురవుతుంది.