#ఇన్ స్టా.. 5కోట్ల క్ల‌బ్ లో టాప్ 5 హీరోయిన్స్

Update: 2021-05-20 11:30 GMT
ఈరోజుల్లో సెల‌బ్రిటీల‌తో క‌మ్యూనికేష‌న్ అంతా ఇన్ స్టా మాధ్య‌మంలోనే. అక్క‌డ నిరంత‌ర ఫోటోషూట్లు.. వీడియో షూట్ల‌ను షేర్ చేస్తూ అసాధార‌ణ ఫాలోవ‌ర్స్ ని సంపాదించుకోవ‌డంలో మ‌న క‌థానాయిక‌లు సునామీ స్పీడ్ తో దూసుకెళుతున్నారు.

ఇన్ స్టాగ్రామ్ లో 50 మిలియన్ క్లబ్‌లలో భాగమైన బి-టౌన్ దివాస్ జాబితాని ప‌రిశీలిస్తే.. ఆ ఐదుగురు టాప్ 5లో ఉన్నారు. ఇన్ స్టాగ్రామ్ లో 50 మిలియన్ల మంది ఫాలోవర్స్ ను అధిగ‌మించిన తొలి ప్రముఖుడు భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ. బాలీవుడ్ లో ప్రియాంక చోప్రా జోనాస్ ఇన్ స్టాగ్రామ్ లో అత్యధికంగా ఫాలో అవుతున్న రెండవ స్టార్. ఇన్ స్టాగ్రామ్ లో 50 మిలియన్ క్లబ్ లో పీసీ ఉన్నారు.

1. ప్రియాంక చోప్రా జోనాస్
వ‌రుస‌గా హాలీవుడ్ సిరీస్ లు సినిమాలు చేస్తున్న పీసీకి గ్లోబ‌ల్ ఐక‌న్ గా గుర్తింపు ఉంది. ఈ క‌రోనా క్రైసిస్ లో భార‌త్ త‌ర‌పున యూనిసెఫ్ బ్రాండ్ అంబాసిడ‌ర్ గా త‌న అభ్య‌ర్థ‌న‌ను ప్ర‌పంచం గుర్తించింది. భార‌త‌దేశానికి సాయానికి ముందుకొచ్చాయి ప‌లు దేశాలు. ప్ర‌స్తుతం మ్యాట్రిక్స్ 4 స‌హా ప‌లు క్రేజీ చిత్రాల్లో ప్రియాంక చోప్రా జోనాస్ న‌టిస్తున్నారు. సోషల్ మీడియాలో ఎక్కువగా ఫాలో అవుతున్న మహిళా బాలీవుడ్ సెలబ్రిటీగా త‌న‌కు అరుదైన రికార్డ్ ఉంది. ఇన్ స్టాలో 63.3 మిలియన్ల (6కోట్ల 33ల‌క్ష‌ల‌) మంది అనుచరులను కలిగి ఉంది. నిరంత‌ర ఫోటోషూట్లు.. వీడియోలతో తన అభిమానులను ఉల్లాస‌ప‌రిచే పీసీ ఇన్ స్టాగ్రామ్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పొందుతోంది.

2.శ్రద్ధా కపూర్
ఇన్ స్టాగ్రామ్ లో `సాహో` శ్రద్ధా కపూర్ కు 62 మిలియన్ల (6కోట్ల 2ల‌క్ష‌ల‌) మంది ఫాలోవర్స్ ఉన్నారు.  అత్యధిక ఫాలోవర్స్ సాధించిన‌ రెండవ బాలీవుడ్ నటిగా త‌న పేరు మార్మోగుతోంది. ఆషిఖి 2 - ఏక్ విల‌న్ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ల‌లో న‌టించిన శ్ర‌ద్ధా సాహో చిత్రంలో ప్ర‌భాస్ స‌ర‌స‌న న‌టించిన సంగ‌తి తెలిసిందే.  ఆ త‌ర్వాత ఫాలోయింగ్ అమాంతం పెరిగింది.

3.దీపికా పదుకొనే
పద్మావత్ చిత్రంతో సంచ‌ల‌నాల‌ దీపికా పదుకొనే  క్రేజ్ అమాంతం పెరిగింది. ఆ ఒక్క సినిమాతో 600కోట్ల క్ల‌బ్ నాయిక‌గా త‌న పేరు రికార్డుల‌కెక్కింది. అగ్ర హీరోల‌కు ధీటుగా సంచ‌ల‌నాలు సృష్టించ‌గ‌ల నాయిక‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఇన్ స్టాగ్రామ్ లో సుమారు 56.5 మిలియ‌న్ల (5కోట్ల 65ల‌క్ష‌ల) ఫాలోవ‌ర్స్ ని క‌లిగి ఉంది. ఆమె చిత్రాలు  వీడియోలు అభిమానులకు శ్రేయోభిలాషులకు బిగ్ విజువల్ ట్రీట్.

4.అలియా భట్
నేటిత‌రంలో అత్యంత క్రేజీ నాయాకిగా ఆలియా పేరు మార్మోగుతోంది. ఆర్.ఆర్.ఆర్- బ్ర‌హ్మాస్త్ర‌- గంగూభాయి క‌తియావాడీ లాంటి భారీ పాన్ ఇండియా చిత్రాల్లో న‌టిస్తోంది. వంద‌శాతం స‌క్సెస్ రేటు ఉన్న నాయిక‌. ఇన్ స్టాగ్రామ్ లో ఆలియా భట్ కు సుమారు 53.1 మిలియ‌న్ల (5 కోట్ల 31 ల‌క్ష‌ల‌) ఫాలోవర్లు ఉన్నారు. 50 మిలియన్ల క్లబ్ లోకి ప్రవేశించారు.

5.జాక్వెలిన్ ఫెర్నాండెజ్
స‌ల్మాన్ భాయ్ ఫ్రెండు.. సాహో బ్యాడ్ గాళ్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ క్రేజు అంతా ఇంతా కాదు. ఇటు సౌత్ లోనూ జాకీకి అసాధార‌ణ ఫాలోవ‌ర్స్ ఉన్నారు. ఇటీవల ఇన్ స్టాగ్రామ్ లో 50 మిలియన్ క్లబ్ లో చేరారు. 50.9మిలియ‌న్ల (5కోట్ల 9ల‌క్ష‌ల‌) ఫాలోవర్స్ తో టాప్ 5 చార్ట్ లో చేరారు.
Tags:    

Similar News