'తుఫాన్' ట్రైలర్: బాక్సర్ గా మారిన స్ట్రీట్ ఫైటర్ కథ..!
బాలీవుడ్ హీరో ఫర్హాన్ అక్తర్ ప్రధాన పాత్రలో బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన హిందీ చిత్రం ''తుఫాన్''. రాకేశ్ ఓం ప్రకాశ్ మెహ్రా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు - టీజర్ విశేష స్పందన తెచ్చుకున్నాయి. కరోనా కారణంగా థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసిన ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో జూలై 16 నుంచి స్ట్రీమింగ్ కి పెడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా 'తుఫాన్' ట్రైలర్ ను చిత్ర బృందం విడుదల చేసింది.
ట్రైలర్ చూస్తుంటే.. ఒక అమ్మాయి ప్రేమలో పడిన తర్వాత ఓ స్ట్రీట్ ఫైటర్.. జాతీయ స్థాయి బాక్సర్ గా ఎలా మారాడు అనే కథాంశంతో 'తుఫాన్' సినిమా రూపొందినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అతను చేసిన తప్పు వల్ల ఐదేళ్లు బాక్సింగ్ నుంచి బ్యాన్ చేయడం.. మళ్ళీ అతను బాక్సింగ్ చేయాలని ప్రేయసి కోరుకోవడం వంటివి ఇందులో చూపించారు. ముంబైలోని డోంగ్రీకి చెందిన అజీల్ అలీ అనే వీధి రౌడీ పాత్రలో ఫర్హాన్ కనిపించాడు. ప్రొఫెషనల్ బాక్సర్ గా కనిపించడానికి ఫర్హాన్ అక్తర్ భారీ వర్కవుట్స్ చేసినట్లు అర్థం అవుతోంది. ఈ సినిమాలో బాక్సింగ్ కోచ్ పాత్రలో పరేష్ రావల్ కనిపిస్తున్నాడు.
'తుఫాన్' సినిమాతో బాక్సింగ్ కు భావోద్వేగాలను కలిపి ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమవుతున్నారని ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. ఈ చిత్రానికి శంకర్-ఎహ్సాన్-లాయ్ సంగీతం సమకూర్చారు. జై పినక్ ఓజా సినిమాటోగ్రఫీ అందించగా.. మేఘ్నా మనిచందన్ సేన్ ఎడిటింగ్ వర్క్ చేశారు. దీనికి స్టోరీ-స్క్రీన్ ప్లే అంజూమ్ రాజాబలి అందించారు. అమెజాన్ ప్రైమ్ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని రితేష్ సిద్వానీ - రాకేశ్ ఓం ప్రకాశ్ మెహ్రా - ఫర్హాన్ అక్తర్ కలిసి నిర్మించారు. 'భాగ్ మిల్ఖా భాగ్' తర్వాత ఫర్హాన్ అక్తర్ - రాకేష్ ఓం ప్రకాశ్ కాంబినేషన్ లో వస్తున్న ''తుఫాన్'' సినిమా ఎలాంటి ప్రేక్షకాదరణ తెచ్చుకుంటుందో చూడాలి.Full View
ట్రైలర్ చూస్తుంటే.. ఒక అమ్మాయి ప్రేమలో పడిన తర్వాత ఓ స్ట్రీట్ ఫైటర్.. జాతీయ స్థాయి బాక్సర్ గా ఎలా మారాడు అనే కథాంశంతో 'తుఫాన్' సినిమా రూపొందినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అతను చేసిన తప్పు వల్ల ఐదేళ్లు బాక్సింగ్ నుంచి బ్యాన్ చేయడం.. మళ్ళీ అతను బాక్సింగ్ చేయాలని ప్రేయసి కోరుకోవడం వంటివి ఇందులో చూపించారు. ముంబైలోని డోంగ్రీకి చెందిన అజీల్ అలీ అనే వీధి రౌడీ పాత్రలో ఫర్హాన్ కనిపించాడు. ప్రొఫెషనల్ బాక్సర్ గా కనిపించడానికి ఫర్హాన్ అక్తర్ భారీ వర్కవుట్స్ చేసినట్లు అర్థం అవుతోంది. ఈ సినిమాలో బాక్సింగ్ కోచ్ పాత్రలో పరేష్ రావల్ కనిపిస్తున్నాడు.
'తుఫాన్' సినిమాతో బాక్సింగ్ కు భావోద్వేగాలను కలిపి ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమవుతున్నారని ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. ఈ చిత్రానికి శంకర్-ఎహ్సాన్-లాయ్ సంగీతం సమకూర్చారు. జై పినక్ ఓజా సినిమాటోగ్రఫీ అందించగా.. మేఘ్నా మనిచందన్ సేన్ ఎడిటింగ్ వర్క్ చేశారు. దీనికి స్టోరీ-స్క్రీన్ ప్లే అంజూమ్ రాజాబలి అందించారు. అమెజాన్ ప్రైమ్ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని రితేష్ సిద్వానీ - రాకేశ్ ఓం ప్రకాశ్ మెహ్రా - ఫర్హాన్ అక్తర్ కలిసి నిర్మించారు. 'భాగ్ మిల్ఖా భాగ్' తర్వాత ఫర్హాన్ అక్తర్ - రాకేష్ ఓం ప్రకాశ్ కాంబినేషన్ లో వస్తున్న ''తుఫాన్'' సినిమా ఎలాంటి ప్రేక్షకాదరణ తెచ్చుకుంటుందో చూడాలి.