• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  టార్గెట్‌ 100పైకి...

టార్గెట్‌ 100పైకి మార్చండి గురూ

By - Tupaki Desk
Update: 2015-07-02 01:30 GMT
పెట్రోల్‌ రేటు రూపాయల్లో పెరిగి పైసల్లో తగ్గుతోంది. సినిమా ధియేటర్ల టిక్కెట్లు కూడా అన్నీ 100 నోటుకంటే పైకే ఎగబాకుతున్నాయి. హీరోయిన్స్‌ రెమ్యూనరేషన్స్‌తో పాట షూటింగ్‌ లొకేషన్స్‌ రేట్లు కూడా పెరిగిపోతున్నాయి. ఇక హీరోల ప్యాకేజీతో కలుపుకుంటే సినిమా మేకింగ్‌ కాస్ట్‌ కూడా పెరిగింది. మరి ఇన్నేసి విధాలుగా ఖర్చులు పెరుగుతున్నా కూడా.. ఓ నాలుగు సంవత్సరాల నుండి చూస్తే ఆదాయం మాత్రం కాన్‌స్టంట్‌గానే ఉంటోంది. వాటే కామెడీ గురూ.

టాలీవుడ్‌ 2015లో అప్పుడే సగం నెలలు గడిపేసినా, 50 కోట్లు కలెక్ట్‌ చేసిన సినిమా ఒక్కటే ఒక్కటి. సన్‌ ఆఫ్‌ సత్యమూర్తి 51.9 కోట్లు వసూలు చేసింది. అయినా బయ్యర్లకు 2 కోట్లు నష్టం వచ్చింది, అది వేరే విషయం. అసలు మన సినిమా కెపాసిటీ కేవలం 50 కోట్ల షేర్‌ మాత్రమేనా? ఒకవేళ గ్రాస్‌ రూపంలో చూసుకున్నా ఈ సినిమాకు ఓ 90 కోట్ల చిల్లర మాత్రమే వచ్చింది. అంటే ప్రేక్షకులు దగ్గర నుండి వచ్చింది 90 కోట్లనమాట. మరి తెలుగు సినిమాలు 100 కోట్లు దాటేదెప్పుడు? షేర్‌ సంగతి సరే పోనివ్‌ గ్రాస్‌నైనా 100 కోట్లు దాటిస్తారా? ఒకవేళ బాహుబలి సినిమా ఈ 100 కోట్ల గ్రాస్‌ను తెచ్చేయవచ్చు. దాని కెపాసిటీ అలా  ఉంది మరి. కాని ఆ తరువాత సీన్‌ ఏంటి? శ్రీమంతుడు, రుద్రమదేవి, చరణ్‌-శ్రీనువైట్ల, ఎన్టీఆర్‌-సుక్కూ, బన్నీ-బోయపాటి.. ఇలా ఎవరైనా ఆ 100 కోట్ల గ్రాస్‌ మార్క్‌ను టచ్‌ చేస్తారా?

నిజానికి టాలీవుడ్‌లో రెవెన్యూలు పెరగాలంటే.. పైరసీ మీద అరవడం కాదు, పబ్లిసిటీ పెంచి, సినిమాల్లో కంటెంట్‌ విలువను పెంచాలి అంటున్నారు విశ్లేషకులు. రొటీన్‌ కంటెంట్‌నే తీసి ఆడియన్స్‌ ఇదే కోరుకుంటున్నారు అని చెబితే దానికి పెద్దగా విలువ ఉండకపోవడమే కాదు.. చచ్చినా 50 కోట్ల షేర్‌ అనేది కూడా రాదు. ఇక 100 కోట్ల గ్రాస్‌ అలాంటి సినిమాలతో ఎక్కడొస్తుంది. చూద్దాం మరి.. స్టార్‌ డైరక్టర్లందరూ ఈ 100పైన ఏమైనా టార్గెట్‌ పెట్టుకొని పనిచేస్తారేమో.

Tags:    
  • Tollywood Movies 
  • Telugu NEws 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS