• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రెండు నెలలపాటు టాలీవుడ్...

రెండు నెలలపాటు టాలీవుడ్ లో పండగే

By - Tupaki Desk
Update: 2015-08-13 05:42 GMT
రెండు పెద్ద సినిమాల ఫ్యూచర్ తెలిసిపోయింది. బాహుబలి, శ్రీమంతుడు.. రెండూ అంచనాలకు మించిన సంచలనాలు సృష్టించాయి. దీంతో మిగిలిన చిన్నా, పెద్దా సినిమాలు వరుసగా క్యూ కడుతున్నాయి. ఎంతలా అంటే.. రాబోయే రెండు నెలలపాటు రిలీజ్ డేట్ల లో అసలెక్కడా గ్యాప్ కూడా లేదు. థియేటర్ల విషయంలో ఇబ్బందులు రాకుండా ఉండేందుకు దాదాపు అన్ని సినిమాలకు రిలీజ్ డేట్స్ ఇచ్చేశారు కూడా.

మొదట ఈ నెల 21న రవితేజ కిక్2  తో వస్తున్నాడు. దీని తర్వాత రుద్రమదేవి సెప్టెంబర్ 4న గ్రాండ్ రిలీజ్ కానుంది ఆ తర్వాత సెప్టెంబర్ 17న శివం విడుదల కానుండగా అదే నెల 24న సుబ్రమణ్యం ఫల్ థియేటర్ల లోకి రానుంది. అనుష్క నటించిన సైజ్ జీరో, వరుణ్ తేజ్-క్రిష్ కాంబినేషన్ లో వస్తున్న కంచె... అక్టోబర్ 2 న పోటీపడనున్నాయి. మంచు విష్ణు డైనమైట్‌ కూడా అక్టోబర్‌ 1నే అని ఫిక్సయ్యాడు. ఇక దసరా సీజన్ కోసం పెద్ద సినిమాలే సిద్ధమవుతున్నాయి. రామ్ చరణ్ తేజ్- శ్రీనువైట్ల మూవీ అక్టోబర్ 15న థియేటర్లకు వస్తుండగా.. అక్టోబర్ 21న అక్కినేని అఖిల్ నటించిన ఫ్యాన్స్ కు ముందుకు రాబోతోంది.

ఇప్పటికైతే షెడ్యూల్ ఫిక్స్ అయింది. ఇక తేలాల్సింది ఈ సినిమాలు అంచనాలు అందుకుంటాయా లేదా అనే. అయితే.. ప్రతీ సినిమా కనీసం 2వారాలపాటైనా ఎక్కువ థియేటర్లలో లేకపోతే పెట్టిన పెట్టుబడులకి మించి కలెక్షన్స్ రావు. మరి ఇన్ని సినిమాలకు స్క్రీన్ల పంపకంపై డిస్ట్రిబ్యూటర్లకు చిక్కులు తప్పేలా లేవు. అయితే నవంబర్ లో దీపావళి కోసం... ఇప్పటివరకూ ఏ సినిమా షెడ్యూల్ కాకపోవడం విశేషం.
Tags:    
  • Tollywood movies 
  • Next Two months 
  • telugu NEws 

Similar News

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS