720px నుండి 70mm వరకూ

Update: 2015-11-27 22:30 GMT
గతంలో సినిమా రంగంపై మోజుతో ఇక్కడకి వచ్చి అవకాశాలు దొరక్క కృష్ణానగర్ లో పస్తులున్న వారి సంఖ్య అధికంగా వుండేది. అయితే అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు కాస్త మెరుగైన పరిస్థితే కనిపిస్తుంది. షార్ట్ ఫిలిమ్స్(లఘు చిత్రాల) పుణ్యమా అని టాలెంట్ వున్న వారికి పట్టం కట్టడం ప్రారంభమైంది. అలా తమ టాలెంట్ తో యు ట్యూబ్ స్టార్స్ నుండి ఫిలిం స్టార్లుగా మారిన కొందరు..

ఈ కోవలోకి మొదట వినిపించే పేరు రాజ్ తరుణ్. MR ప్రొడక్షన్స్ బ్యానర్ లో వచ్చే లఘుచిత్రాలకు హీరోగా నటిస్తూ ఉయ్యాల జంపాలలో ఛాన్స్ కొట్టేసిన రాజ్ తరుణ్ ఇక వెనుతిరిగి చూసుకోలేదు. వరుసపెట్టి మూడు విజయాలు. ప్రస్తుతం చేతిలో మూడు సినిమాలతో స్టార్ స్టేటస్ కి దగ్గరలో వున్నాడు.

నెల్లూరు యాసతో ప్రేక్షకులను తనదైన శైలిలో అలరిస్తున్న సుదర్శన్ సైతం ఇటీవల సినిమాలలో తరచూ పాత్రలు దక్కించుకుంటున్నాడు. వైవా హర్షా, భద్రం కూడా ఈ జాబితాలో నిలచె కామెడి స్టార్సే.

ఇక దర్శకుల విషయానికొస్తే రన్ రాజా రన్ తో హిట్ కొట్టిన సుజిత్ - వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తో నవ్వించిన మేర్లపాక గాంధీ కూడా షార్ట్ ఫిలిమ్స్ లో ఆరితేరిన దర్శకులే.

వీళ్ళేకాక 'కిరాక్' హీరో అనిరుధ్ - కేటుగాడు హీరోయిన్ చాందిని చౌదరి కూడా షార్ట్ ఫిలిమ్స్ తో ఫ్యాన్స్ బేస్ సంపాదించుకుని వెండితెరవైపు వచ్చిన వాళ్ళే. వీళ్ళందరికీ, రానున్న వాళ్ళకూ మన సినీ కళామతల్లి చల్లటి నీడనివ్వాలని కోరుకుందాం. 
Tags:    

Similar News