డిసెంబర్.. ఒక్క హిట్టు కావాలమ్మా
ఒక్క హిట్టు పడితే చాలు అనుకునే హీరోలు ప్రస్తుతం టాలీవుడ్ లో చాలామంది ఉన్నారు. గతంలో మంచి హిట్స్ అందుకొని ఊపుమీద ఉన్న హీరోలు ఆ తర్వాత వరుస పరాజయాలను చూశారు. ఇకపోతే ఈ డిసెంబర్ లో వారి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. వారికి ఆ సినిమాలు ఎంత అవసరం అంటే.. ఈ సినిమా హిట్ అయితేనే కెరీర్ కొంచెం ట్రాక్ లో పడుతుంది. ఆ తరహాలో అదృష్టాన్ని పరిక్షించుకోవడానికి డిసెంబర్ లో రాబోతోన్న హీరోలు లిస్ట్ పెద్దగానే ఉంది.
సాయిధరమ్ తేజ్ - అఖిల్ - సుమంత్ - నాగశౌర్య అలాగే అల్లు శిరీష్ - సునీల్ వంటి హీరోలు డిసెంబర్ లోనే సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. ఈ లిస్ట్ లో ముందుగా చెప్పుకోవాల్సింది అఖిల్ గురించి. అఖిల్ సినిమాతో మొదటి అడుగులోనే డిజాస్టర్ ని చూసిన ఈ అక్కినేని వారసుడు నెక్స్ట్ హలో చెప్పి మెప్పించాలని చూస్తున్నాడు. డిసెంబర్ 22న రిలీజ్ కాబోతోన్న ఈ సినిమా కోసం నాగ్ ప్రమోషన్స్ కూడా బారి స్థాయిలో చేస్తున్నాడు.
ఇక సునీల్ పరిస్థితి కూడా దాదాపు అలానే ఉంది. స్టార్ కమెడియన్ గా మంచి గుర్తింపును తెచ్చుకొని హీరోగా అడుగులు వేశాడు. కెరీర్ లో మర్యాదరామన్న తప్పితే మరో మంచి హిట్టు లేదు. ఇప్పుడు 2 కంట్రీస్ అనే రీమేక్ మూవీతో డిసెంబర్ లోనే సక్సెస్ కొట్టాలని చూస్తున్నాడు. సాయి ధరమ్ తేజ్ కెరీర్ కూడా కొంచెం కష్టకాలంలోనే ఉంది. ఈ మెగా అల్లుడు విజయాన్ని చూసి చాలా కాలమే అవుతోంది. దీంతో ఎలాగైనా హిట్ అందుకోవాలని ఇవాళే జవాన్ తో వచ్చాడు. ఈ సినిమా రిజల్ట్ రెండు రోజుల్లో తేలిపోనుంది.
ఇక సుమంత్ కూడా కెరీర్ లో నిలదొక్కుకోవాలని మళ్లీ రావా అనే సినిమాను రిలీజ్ చేస్తున్నాడు. డిసెంబర్ 8న వస్తోన్న ఈ సినిమా రిజల్ట్ అతనికి చాలా అవసరం. ఇక నాగ శౌర్య కూడా ఇదే నెలలో ఛలో తో హిట్ అందుకోవాలని అనుకుంటున్నాడు. అతని కెరీర్ కి కూడా చలో హిట్టు చాలా అవసరం. ఆ సినిమా డిసెంబర్ 29న రిలీజ్ కాబోతోంది. ఇక అల్లు హీరో శిరీష్ కూడా దాదాపు అదే పరిస్థితిలో ఉన్నాడు.
కెరీర్ లో ఒక మంచి హిట్ కొట్టాలని సైన్స్ ఫిక్షన్ తరహా కథతో తెరకెక్కిన ఒక్క క్షణం సినిమాను డిసెంబర్ 23న రిలీజ్ చేస్తున్నాడు. అయితే మిగతా వారు మాత్రం వారి సినిమాలను చాలా కూల్ గా చేసుకుంటున్నారు. అందులో నాని ఫస్ట్ అని చెప్పవచ్చు. వరుస విజయాలతో ఉన్న నాని - MCA పై అంచనాలు కూడా బాగానే ఉన్నాయి. మరి మొత్తంగా డిసెంబర్ నెల ఈ స్టార్స్ కి ఏ స్థాయిలో కలిసొస్తుందో చూడాలి. గత నెలలో అస్సలు హిట్లు లేవు కాబట్టి.. ఈ నెల కనీసం ఒక్క హిట్టయినా కావాలి మరి.