టాలీవుడ్ స్టార్స్ ని కాస్తా ట్విట్టర్ స్టార్స్ ని చేసేస్తున్నారుగా...!
మన టాలీవుడ్ స్టార్స్ సోషల్ మీడియా ద్వారా తమ అభిమానులకు నిత్యం అందుబాటులో ఉంటున్నారు. ఇప్పుడు రీసెంటుగా ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి వచ్చీ రావడంతోనే సోషల్ మీడియాలలో పోస్టుల వర్షం కురిపిస్తున్నాడు. ఇప్పటికే స్టార్ హీరోలైన అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్, మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్ మొదలైన వారితో పాటు యంగ్ హీరోలు కూడా సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ లో యాక్టీవ్ గా ఉంటున్నారు. ఇప్పుడు సినిమా ప్రచారానికి కూడా సోషల్ మీడియా కీలకంగా మారడంతో ట్విట్టర్ ద్వారా ఎక్కువగా ప్రమోట్ చేసుకోడానికి చూస్తున్నారు. దీంతో కొన్ని గంటల్లోనే ప్రపంచవ్యాప్తంగా విస్తరించి సినిమాలకు విపరీతంగా ఉచిత ప్రచారం దొరుకుతోంది.
అంతేకాకుండా మన హీరోల ఫ్యాన్స్ కూడా వారి హీరోలను ముందుకు తీసుకుపోవడానికి ట్విట్టర్ ని సాధనంగా వాడుకుంటున్నారు. తమ అభిమాన హీరోలకు సంబంధించి బర్త్ డే లను.. సినిమాలకు ట్రెండ్స్ క్రియేట్ చేస్తూ నేషనల్ వైడ్ పాపులర్ చేయాలని చూస్తుంటారు. రకరకాల హ్యాష్ ట్యాగ్స్ తో ట్రెండింగ్ చేస్తూ ఇన్ని గంటల్లో ఇన్ని మిలియన్ల ట్వీట్స్ అంటూ రికార్డ్స్ గురించి గొప్పలు చెప్పుకుంటూ వస్తున్నారు. మా హీరో హ్యాష్ ట్యాగ్ కి ఇన్ని మిలియన్ల ట్వీట్ కౌంట్ వచ్చిందని.. మీ హీరో ఈ ఫీట్ ని రీచ్ అవలేడని.. ట్విట్టర్ వార్స్ కూడా నడుస్తుంటాయి. మొత్తం మీద వారి అభిమానులు టాలీవుడ్ స్టార్స్ ని కాస్తా ట్విట్టర్ స్టార్స్ ని చేసేస్తున్నారు అని చెప్పవచ్చు.
దీనికి తోడు కొంతమంది హీరోల పెయిడ్ ప్రొమోషన్స్ కూడా ట్విట్టర్ లో ట్రెండింగ్ కి కారణం అవుతుంది. తమ పీఆర్వోల చేత పెయిడ్ ప్రొమోషన్స్ చేపించుకుంటూ నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతున్నాడు. దీంతో మన టాలీవుడ్ స్టార్స్ ట్విట్టర్ ట్రెండ్స్ లో బాలీవుడ్ స్టార్స్ ని దాటి ట్రెండింగ్ లో ఉంటున్నారు. కాకపోతే ఎటూ వచ్చి సోషల్ మీడియా వార్స్ మరియు ట్విట్టర్ ట్రెండింగ్ లతో మన మీద ఇంకా చిన్న చూపు పడేలా చేస్తుంది. 24 గంటల్లో ఇన్ని లక్షల ట్వీట్స్.. ఇన్ని మిలియన్ల ట్వీట్స్ తో ట్రెండ్ చేశారు అనే గోల ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది.
కానీ ఇంత ట్రెండింగ్ లో ఉండే హీరోల సినిమాలకి డబ్బులు ఎందుకు రావడం లేదు అనే ప్రశ్న కూడా సినిమా వాళ్లని తొలుస్తోంది. సినిమా ప్రమోషన్స్ వరకు అవసరం మేరకు ట్విట్టర్ ని వాడుకుంటే పర్వాలేదు కానీ.. ఇలా ప్రతి దానికి ట్రెండ్ క్రియేట్ చేపించుకుంటూ.. సినిమాల విసయానికొచ్చే సరికి అరకొర కలెక్షన్స్ తో సరిపెట్టుకుంటుంటే మిగతా ఇండస్ట్రీల వారికి లోకువ అవుతారని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నారు. మన హీరోలు ఈ ట్విట్టర్ మాయ నుంచి ఎంత త్వరగా బయటకు వస్తే అంత మంచిదని సినీ విశ్లేషకులు సూచిస్తున్నారు.