ఉద‌య్‌పూర్‌లో అంబానీ విమానం.. దేవ‌ర‌కొండ‌-ర‌ష్మిక పెళ్లికేనా?

విజయ్ దేవరకొండ- ర‌ష్మిక మంద‌న్న జంట (#విరోష్ వెడ్డింగ్) ఈనెల 26 (ఫిబ్ర‌వ‌రి 26)న వివాహం చేసుకోనున్న సంగ‌తి తెలిసిందే.;

Update: 2026-02-25 04:33 GMT

విజయ్ దేవరకొండ- ర‌ష్మిక మంద‌న్న జంట (#విరోష్ వెడ్డింగ్) ఈనెల 26 (ఫిబ్ర‌వ‌రి 26)న వివాహం చేసుకోనున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే రాజ‌స్థాన్ ఉద‌య్ పూర్ లో ప్రీవెడ్డింగ్ సెల‌బ్రేష‌న్స్ పీక్స్ కి చేరుకున్నాయి. ఈ పెళ్లికి 100 మంది అతిథులు హాజ‌ర‌వుతున్నార‌ని క‌థ‌నాలొచ్చాయి. అయితే ఈ అతిథుల‌లో ప్ర‌పంచ కుభేరుడు ముఖేష్ అంబానీ, ఆయ‌న కుటుంబ స‌భ్యులు ఉన్నార‌ని ప్ర‌చారం సాగుతోంది.

ఈ ప్ర‌చారానికి త‌గ్గ‌ట్టుగానే అంబానీ కుటుంబం ఉద‌య్ పూర్ లో విమానం దిగ‌డంతో ఒక‌టే గుస‌గుస‌లు వేడెక్కించేస్తున్నాయి. ముఖేష్ అంబానీ, నీతా అంబానీ, కోకిలాబెన్ అంబానీ, ఆకాష్ అంబానీ, శ్లోకా అంబానీలు వివాహ వేడుకకు హాజరవుతారని వ‌రుస క‌థ‌నాలు వెలువ‌డుతున్నాయి. అయితే అంబానీ కుటుంబం ఉదయపూర్ సందర్శనకు రష్మిక, విజయ్ వివాహానికి ఎటువంటి సంబంధం లేదని తెలుస్తోంది. ఉద‌య్ పూర్ లోని నాథ్ ద్వారాలో ఉన్న శ్రీనాథ్ జీ ఆలయంలో ఆశీర్వాదం పొందడానికి అంబానీ కుటుంబ సభ్యులు ఉదయపూర్ వెళ్లినట్లు సమాచారం.

అంబానీ కుటుంబం రాక - నిజమా? గాసిప్పా?

అంబానీ కుటుంబం ఉదయ్‌పూర్ చేరుకున్న మాట నిజమే అయినా ఇవి కేవ‌లం దైవ‌ద‌ర్శ‌నం కోసం మొక్కులు చెల్లించుకోవ‌డం కోసం మాత్ర‌మేన‌ని తెలుస్తోంది. అయితే ఆల‌యం వ‌ద్ద నుంచి అంబానీ కుటుంబం ఫోటోలు వైర‌ల్ కాగా, వాటిని దేవ‌ర‌కొండ అభిమానులు వైర‌ల్ చేస్తూ, ఇది త‌మ ఫేవ‌రెట్ హీరో పెళ్లి లో సంద‌డి అంటూ వైర‌ల్ చేసారు. ఇది కేవ‌లం అభిమానుల ఉత్సాహం మాత్ర‌మే. కాబట్టి అంబానీలు ఈ పెళ్లికి హాజరవుతున్నారనే వార్త ప్రస్తుతానికి కేవలం గాసిప్ మాత్రమే. దీనిపై ఎటువంటి అధికారిక ధృవీకరణ లేదు.

పెళ్లి అతిథుల వివరాలు:

ఈ సెల‌బ్రిటీ వివాహ వేడుక చాలా ప్రైవేట్‌గా కేవలం 100 మంది అత్యంత సన్నిహితుల మధ్య జరుగుతోంది. ఇప్పటివరకు ఉదయ్‌పూర్ ఎయిర్‌పోర్టులో కనిపించిన ప్రముఖుల జాబితా చూస్తే, దర్శకుడు తరుణ్ భాస్కర్, నటి ఈషా రెబ్బా, నటి ఆషికా రంగనాథ్, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ త‌దిత‌రులు క‌నిపించారు. సందీప్ రెడ్డి వంగా కూడా హాజరయ్యే అవకాశం ఉంది.

దక్షిణాది సంప్రదాయ విందు (మెనూ):

పెళ్లిలో భోజనం పూర్తిగా దక్షిణాది శైలిలో ఉండబోతోంద‌ని స‌మాచారం. అతిథులకు అరిటాకుల్లో భోజనం వడ్డించనున్నారు. ఆతిథ్యంలో భాగంగా ప్రత్యేకంగా కొబ్బరి నీళ్లను ఏర్పాటు చేశారు. ఇప్పటికే `విరోష్ క్రికెట్ ప్రీమియర్ లీగ్` వంటి సరదా క్రీడలతో కుటుంబ సభ్యులు సందడి చేశారు. 26 ఫిబ్రవరి 2026న వివాహం జ‌రుగుతుంది. సినీ పరిశ్రమలోని స్నేహితుల కోసం 4 మార్చి 2026న భారీ విందు ఏర్పాటు చేయనున్నారని తెలుస్తోంది.

మొత్తానికి, అంబానీలు ఉదయ్‌పూర్‌లో ఉండటం యాదృచ్ఛికమే తప్ప.. అది విజయ్-రష్మిక పెళ్లి కోసం కాదని తాజా సమాచారం బట్టి అర్థమవుతోంది. మరిన్ని వివరాలు పెళ్లి నుంచి డైరెక్ట్ ఫోటో- వీడియో లీక్ ల‌ను ప‌రిశీలించి ధృవీక‌రించాల్సిందే.

Tags:    

Similar News