నాని 'హుక్ స్టెప్'.. ఇది మామూలు సర్ప్రైజ్ కాదు..
టాలీవుడ్ స్టార్ హీరో నాని ఇప్పటివరకు నేచురల్ యాక్టింగ్, సింపుల్ స్టెప్స్ తో ఆకట్టుకోగా.. తాజాగా ఊరమాస్ హుక్ స్టెప్ తో సోషల్ మీడియాతోపాటు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారారు.;
టాలీవుడ్ స్టార్ హీరో నాని ఇప్పటివరకు నేచురల్ యాక్టింగ్, సింపుల్ స్టెప్స్ తో ఆకట్టుకోగా.. తాజాగా ఊరమాస్ హుక్ స్టెప్ తో సోషల్ మీడియాతోపాటు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారారు. ఆయన హీరోగా తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ ఆయా షేర్.. ప్రస్తుతం యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ సాధిస్తూ దూసుకుపోతోంది.
నాని వేసిన మాస్ స్టెప్, జడను పట్టుకుని వేసే హుక్ స్టెప్ సాంగ్ స్పెషల్ అట్రాక్షన్ గా మారాయి. పాట స్టార్టింగ్ నుంచి చివరి వరకు ఆయన ఎనర్జీ, బాడీ లాంగ్వేజ్, ఎక్స్ప్రెషన్స్ అభిమానులను ఫిదా చేస్తున్నాయి. జడల్ పాత్రలో రా అండ్ రస్టిక్ లుక్ లో కనిపించిన నాని, కంప్లీట్ కొత్త మాస్ అవతార్ లో సందడి చేశారు. టాటూను హైలైట్ చేస్తూ చూపించిన షాట్స్.. ఆకట్టుకున్నాయి.
నిజానికి.. నాని నుంచి ప్రేక్షకులు భారీ డ్యాన్స్ నెంబర్లు ఆశించరు. సింపుల్ స్టెప్స్ తోనే సరిపెడతారని ఎప్పుడూ భావిస్తుంటారు. అయితే ఈసారి మాత్రం అందరి అంచనాలు తారుమారు చేస్తూ నెవ్వర్ బిఫోర్ అనేలా మాస్ స్టెప్స్ తో షాక్ ఇచ్చారు నాని. ఆయా షేర్ సాంగ్ లోని హుక్ స్టెప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ రీల్స్, షార్ట్స్ గా ట్రెండింగ్ లో నిలుస్తోంది.
అయితే ఆ పాటకు అడ్డుల జంగిరెడ్డి, ఆకునూరి దేవయ్య వోకల్స్ అందించగా, సుధన్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ఆయన స్టెప్స్ పాటకు మరింత మ్యాడ్ ఎనర్జీని యాడ్ చేశాయి. ప్రతి బీట్ కు తగ్గట్టు నాని ఇచ్చిన మ్యానరిజమ్స్, డ్యాన్స్ మూవ్స్.. సాంగ్ ను చార్ట్ బస్టర్ చేశాయి. సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ పవర్ ఫుల్ బీట్స్ తో కంపోజ్ చేశారు. అదిరిపోయే బీట్స్, మాస్ రిథమ్, హై ఎనర్జీ ట్యూన్.. థియేటర్లలో ప్రేక్షకులను ఉర్రూతలూగించేలా ఉన్నాయి.
ఇక సినిమా విషయానికొస్తే.. శ్రీకాంత్ ఓదెల – నాని కాంబినేషన్ లో ఇది రెండో సినిమా. గతంలో వచ్చిన దసరా మూవీలో ధరణి పాత్రతో ఊరమాస్ గా కనిపించిన నాని, ఈసారి జడల్ గా మరింత మాస్ గా కనిపిస్తున్నారు. దర్శకుడు నాని పాత్రను మాస్ ఆడియెన్స్ కు కనెక్ట్ అయ్యేలా డిజైన్ చేసినట్టు తెలుస్తోంది. ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్, ఫస్ట్ లుక్ పోస్టర్లు సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ఇప్పుడు ఆయా షేర్ సాంగ్.. వాటిని మరింత పెంచిందని చెప్పాలి. ఏదేమైనా.. నాని హుక్ స్టెప్, అనిరుధ్ బీట్, మాస్ విజువల్స్ అన్నీ కలిసి సాంగ్ ను మాస్ ఫెస్టివల్ గా మార్చేశాయి. పాన్ వరల్డ్ రేంజ్ లో పలు భాషల్లో ఆగస్టు 21న ప్యారడైజ్ సినిమా థియేటర్లలోకి రానుండగా.. ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.