ఇంటి గోడను కూడా అద్దెకిచ్చేశారా??

Update: 2016-02-24 19:30 GMT
ఫిలిం నగర్‌ లో ఒక పెద్దాయన ఇల్లు. ఆయన ఇప్పుడు అక్కడ నుండి మూవ్‌ అయిపోయారు. వేరే చోట పెద్ద ప్యాలెస్‌ కట్టుకొని అక్కడే ఉంటున్నారు. అయితే ఫిలిం నగర్‌ మెయిన్‌ రోడ్‌ లో ఉన్న ఈయన ఇంటి గోడను కూడా ఇప్పుడు రెంట్‌ కు ఇచ్చారు తెలుసా!!

ఒకప్పుడు ఆ గోడకు కేవలం ఆయన ఫ్యామిలీకి సంబంధించిన సినిమాల తాలూకు పోస్టర్లు హోర్డింగులే ఉండేవి. కాని ఇప్పుడు మాత్రం.. అక్కడ నాలుగు భాగాలు చేసి.. అందులో ఒక హోర్డింగ్‌ వారే ఉంచుకుని.. మిగిలిన మూడు ముక్కలూ అద్దెకు ఇస్తున్నారు. అసలు ఫిలిం నగర్‌ మెయిన్‌ రోడ్డు కాబట్టి.. ఖచ్చితంగా జనాలు ఎంత అద్దె అయినా భరించి అక్కడ యాడ్‌ వేయిస్తారులే. కాకపోతే అసలు ఇంత పెద్ద నటుడి ఫ్యామిలీ ఇలా బిజినెస్‌ యాంగిల్‌ లో థింక్‌ చేస్తుందా అనేదే అత్యంత షాక్‌.

సర్లేండి.. ఆ ప్రక్కన ఉన్న మరో నిర్మాత-నటుడి ఫ్యామిలీ అయితే.. ఏకంగా వారి ఇంటిని రెస్టారెంట్‌ అండ్‌ ఫుడ్ జాయింట్లకు లీజుకు ఇచ్చారు. ఇల్లంతా అద్దెకిస్తే లేనిది.. ఒక గోడను ఆద్దెకిస్తే ఏమవుతుందిలే. కాకపోతే ఈ గోడ పలానా వారిది అని తెలిసి.. అరే గోడను కూడా వీరు వదల్లేదా అంటూ జనాలు చమత్కరించుకోవడం కామనే కదా!!

Tags:    

Similar News