టాలీవుడ్ హీరో అరెస్ట్.. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు
టాలీవుడ్ సినీ నటుడు కృష్ణుడు అరెస్ట్ కావడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పేకాట కేసులో హీరో కృష్ణుడు అరెస్ట్ అయినట్టు మీడియాలో వార్తలు జోరుగా వస్తున్నాయి. హీరో కృష్ణుడుతోపాటు మరో ఎనిమిది మందిని కూడా అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్ మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శిల్పాపార్క్ విల్లాలో పేకాట ఆడుతున్నట్లు గుర్తించిన పోలీసులు నటుడు కృష్ణుడును అదుపులోకి తీసుకున్నారు. నటుడు కృష్ణుడుతోపాటు ప్రధాన నిర్వాహకుడు పెద్దిరాజు సహా మొత్తం ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలిసింది.
గుర్తు తెలియని వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు మియాపూర్ పోలీసులు చాలా ప్లానింగ్ గా దాడి చేసి ఈ గ్యాంగ్ ను అరెస్ట్ చేసినట్టు చెబుతున్నారు. అయితే పేకాట ఆడుతున్న వారి అరెస్ట్ విషయాన్ని పోలీసులు చాలా గోప్యంగా ఉంచారని తెలిసింది.
నటుడు కృష్ణుడు తెలుగు చిత్రపరిశ్రమలో కామెడీ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. విలేజ్ లో వినాయకుడు, హ్యాపీడేస్, యువత, షాక్, ఆర్య2, స్నేహగీతం, జ్యోతి లక్ష్మీ తదితర సినిమాల్లో నటించాడు. ప్రస్తుతం వైసీపీ పార్టీలో కొనసాగుతున్నాడు.