ఫొటోటాక్ : 40 లోనూ అదే వయ్యారం.. అదే కవ్వింపు

Update: 2021-10-01 16:30 GMT
రెండు దశాబ్దాల క్రితం ఇష్టం సినిమా తో తెలుగు ప్రేక్షకులకు శ్రియ పరిచయం అయ్యింది. దాదాపు దశాబ్ద కాలం పాటు సౌత్ లో స్టార్‌ హీరోయిన్‌ గా వెలుగు వెలిగింది. హాలీవుడ్‌ సినిమాల్లో కూడా నటించే అవకాశాలు దక్కించుకున్న శ్రియా శరన్‌ ఇప్పటికి కూడా అన్ని భాషల్లో నటిస్తూ అలరిస్తూ ఉంది. సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో హాట్ ఫొటో షూట్ ను షేర్‌ చేయడం ద్వారా కూడా అభిమానులను మరియు ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ఈ అమ్మడు హాట్ హాట్‌ ఫొటోలను రెగ్యులర్ గా షేర్‌ చేస్తుండటంతో ఈమె ఇన్ స్టా గ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య మూడు మిలియన్ లకు చేరింది. ఇక ఈమె వయసు మరి కొన్ని నెలల్లో నాలుగు పదులకు చేరుతుంది. అయినా కూడా ఈ అమ్మడి అందాల ఆరబోత పాతికేళ్ల అమ్మాయి మాదిరిగానే ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

అందాల ఆరబోత ఎవరైనా చేయవచ్చు. కాని ఇప్పటికి కూడా ఆమె అందాలను అలా చూస్తుండి పోవాలని అభిమానులు కోరుకుంటున్నారు అంటే ఆమె ఏ స్థాయిలో ఆకట్టుకునేలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అందంతో పాటు అభినయం కూడా ఉన్న శ్రియా మరో పదేళ్లు అయినా కూడా ఇలాగే ఉంటుందేమో అంటూ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆకట్టుకునే రూపంతో పాటు మంచి ఫిజిక్ ను మెయింటెన్ చేయడంలో శ్రియ ఈ ఇరవై ఏళ్లలో ఎప్పుడు కూడా అలసత్వం కనబర్చలేదు. అందుకే ఈ అమ్మడి అందం ఏమాత్రం తగ్గలేదు అంటూ కొందరు ఆమె అందం యొక్క రహస్యంను చెబుతున్నారు.

పెళ్లి తర్వాత సహజంగా అయితే సినిమాలకు సోషల్‌ మీడియాకు దూరం అవుతారు. కాని శ్రియ ఈ ఫొటో చూస్తే ఆమె జనాలను ఏ రేంజ్ లో కవ్విస్తుందో అర్థం చేసుకోవచ్చు. పచ్చని డ్రస్‌ లో కావాల్సినంత క్లీవేజ్ షో చేస్తూ థైస్ ను కాస్త చూపిస్తూ అలా అలా తన అందాలను కనువిందు చేస్తున్న ముద్దుగుమ్మ శ్రియ ఈ ఫొటోలో ఒక శిల్పం మాదిరిగా అందంగా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి. మొత్తానికి ముద్దుగుమ్మ శ్రియ శరణ్ ను అభిమానులు ఇంకా ఇంకా అభిమానించే ఈ ఫొటో ఉంది అనడంలో సందేహం లేదు. నాలుగు పదుల వయసుకు వచ్చిన శ్రియ అదే అందంతో.. ఆ చూపుతో కవ్విస్తూ ఉంది అనడంలో సందేహం లేదు.


Tags:    

Similar News