టాలీవుడ్ డ్రగ్స్ కేసు: ఈడీ కి ఏదైనా లీడ్ దొరుకుతుందా..?
2017 టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తు ముమ్మరం చేస్తోంది. నాలుగేళ్ళ క్రితం నాటి కేసు ఛార్జ్ షీట్స్ ఆధారంగా.. డ్రగ్స్ వ్యవహారాల్లో ఆర్థిక లావాదేవీలు జరిగాయనే కోణంలో ఈడీ విచారణ జరుపుతోంది. మనీలాండరింగ్ మరియు ఫెమా రెగ్యులేషన్స్ ఉల్లంఘనల చట్టం కింద ఈ పలువురికి నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే డైరెక్టర్ పూరీ జగన్నాధ్ - నటి ఛార్మీ - హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ లను సుదీర్ఘంగా ప్రశ్నించారు.
డ్రగ్స్ వ్యవహారాల్లో మనీలాండరింగ్ జరిగిందా లేదా అనేది నిగ్గు తేల్చడానికి ఈ విచారణలో వారి బ్యాంక్ లావాదేవీలను ఈడీ అధికారులు పరిశీలిస్తున్నారు. వీరి ఖాతాల ఆన్ లైన్ ట్రాన్సాక్షన్ల గురించి.. విదేశీ అకౌంట్స్ కు బదిలీ అయిన నగదు గురించి వివరాలు తెలుసుకుంటున్నట్లు మీడియా నివేదికలు వస్తున్నాయి. ఈడీ నోటీసుల్లోనే తప్పనిసరిగా వారి బ్యాంక్ స్టేట్మెంట్స్ తీసుకురావాలని కోరింది. ఇప్పటి వరకు విచారణ ఎదుర్కొన్న ముగ్గురునీ వీటికి సంబంధించిన ప్రశ్నలు మాత్రమే అడిగినట్లు సమాచారం.
డ్రగ్స్ కేసులో అప్రూవర్ గా మారిన మాధకద్రవ్యాల సప్లయిర్ కెల్విన్ ఇచ్చిన సమాచారం ఆధారంగానే ఈడీ ఈ విచారణ వేగవంతం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అలానే అతని మొబైల్ ఫోన్ లోని డేటా ఆధారంగా పలువురు టాలీవుడ్ ప్రముఖులతో టచ్ లో ఉన్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో కెల్విన్ తో డ్రగ్స్ క్రయవిక్రయాలలో వీరి పాత్ర ఏమైనా ఉందని ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఒకవేళ వీళ్ళ అకౌంట్ల నుంచి అక్రమ లావాదేవీలు జరిగినట్లు తేలితే ఈడీ తదుపరి చర్యలు చేపట్టే అవకాశం ఉంది.
ప్రస్తుతానికి విచారణ పూర్తి చేసుకున్న ముగ్గురినీ.. అవసరం అయితే మరోసారి పిలుస్తామని ఈడీ అధికారులు చెప్పారట. అయితే సినీ ప్రముఖులు కూడా విచారణకు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తామని.. మళ్లీ పిలిచినప్పుడు రావడానికి అభ్యంతరాలు ఏమీ చెప్పలేదని తెలుస్తోంది. అయితే డ్రగ్స్ కేసులో ఈడీకి ఏదైనా లీడ్ దొరుకుందా లేదా అని అందరిలో ఉత్కంఠ నెలకొంది.
ఎక్సైజ్ శాఖ నాలుగేళ్ళ క్రితం టాలీవుడ్ డ్రగ్స్ కేసుపై విచారణ చేపట్టింది. సంచలనంగా మారిన ఈ కేసులో ఎంతో మందిని ప్రశ్నించారు.. ఎన్నో ఛార్జ్ షీట్లు దాఖలు చేశారు. ఈ వ్యవహారం అప్పట్లో ఇండస్ట్రీని కుదిపేసింది. మీడియాలో సోషల్ మీడియాలో ఎక్కడా చూసినా టాలీవుడ్ డ్రగ్స్ గురించే డిస్కష్ చేసుకున్నారు. అయితే ఇందులో ఏ ఒక్క సెలబ్రిటీపై కేసు నమోదు చేయలేదు.. అరెస్ట్ చేయలేదు. అంతేకాదు సినీ ప్రముఖులందరికీ క్లీన్ చీట్ వచ్చింది.
ఇప్పుడు అదే కేసులో ఈడీ కలుగజేసుకుంది. మాధకద్రవ్యాల వ్యవహారంలో మనీ లాండరింగ్ జరిగి ఉంటుందని విచారణ సాగిస్తోంది. ప్రస్తుతానికి వీరందరినీ ఈడీ సాక్షులుగా మాత్రమే పిలుస్తోందని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ వీరిని మళ్ళీ పిలిస్తే మాత్రం ఈ కేసులో వారి ప్రమేయం పై అనుమాన పడొచ్చు. మరి ఈసారైనా టాలీవుడ్ డ్రగ్స్ కేసులో లీడ్ దొరుకుతుందా? లేదా గతంలో మాదిరిగా క్లీన్ చిట్ వస్తుందా? అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇకపోతే డ్రగ్స్ కేసులో సెప్టెంబర్ 8న రానా దగ్గుబాటి - 9న రవితేజ మరియు ఆయన డ్రైవర్ శ్రీనివాస్ - 13న నవదీప్ మరియు ఎఫ్ క్లబ్ పబ్ జనరల్ మేనేజర్ - 15న ముమైత్ ఖాన్ - 17న తనీష్ - 20న నందు - 22న తరుణ్ ఈడీ అధికారుల ఎదుట హాజరు కానున్నారు.