ట్రెండ్ : ఒక్కొక్కరికి రెండ్రెండు ఛాన్సులు

Update: 2016-02-08 22:30 GMT
ఒక సినిమాని డైరెక్ట్ చెయ్యడం అన్నది కత్తి మీద సాము. అందులోనూ తానే రచయితగా వ్యవహరిస్తూ డైరెక్షన్ చెయ్యడమంటే సవాలే. అందుకే సినిమా రంగంలో ఏ డిపార్ట్ మెంట్ లో పనిచేసేవాళ్ళైనా ఏకకాలంలో రెండు మూడు ప్రాజెక్ట్ లలో తలదూర్చచ్చుగానీ డైరెక్టర్ మాత్రం ఒకే ప్రాజెక్ట్ కి స్టిక్ అయ్యి వుంటాడు.

కానీ ప్రస్తుతం ట్రెండ్ మారుతుంది. ఒక సినిమా చేస్తున్నంత సేపూ దానిపై తగిన దృష్టిపెడుతూనే మరో సినిమా గురించి ఆలోచిస్తున్నారు నేటి తరం దర్శకులు. మొన్న పూరి జగన్నాధ్ రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు నందమూరి హీరోలకు కధ చెప్పి ఒప్పించడం గొప్ప విషయమే. రామ్ గోపాల్ వర్మ ఇలాంటి ఫీట్లు చాలానే చేశాడు.

తాజాగా నేను శైలజ డైరెక్టర్ కిషోర్ తిరుమల తన తదుపరి ప్రాజెక్ట్ తో నితిన్ ని ఒప్పించాడన్న వార్త నలుగురినోళ్ళలో నానకముందే మరో ప్రాజెక్ట్ తో వెంకటేష్ ని ఒప్పించినట్టు సమాచారం. మారుతికూడా వెంకీ సినిమా చేస్తుంటే చరణ్ మూవీ కి స్క్రిప్ట్ రాస్తున్నాడట. బోయపాటి బన్నీని షూట్ చేస్తూ బాలయ్య తనయుడి ఎంట్రీకోసం స్కెచ్చులు గీస్తున్నాడు. ఇలా ఒక ప్రాజెక్ట్ చేతులో వుంటూనే మరో ప్రాజెక్ట్ కి పనిచెయ్యడం రెండు కత్తుల మీద సామే.. ఎలా మేనేజ్ చేస్తున్నారు సామీ.. 
Tags:    

Similar News