70 కథలు: ఆ సినిమాను వదులుకున్నా

Update: 2015-04-10 06:13 GMT
ఒక కళాదర్శకుడు (ఆర్ట్‌ డైరెక్టర్‌) .. టాలీవుడ్‌లో చాలామంది స్టార్‌ డైరెక్టర్లతో పనిచేశాడు. ఇంకా చెప్పాలంటే తెలుగు సినిమాని ఏల్తున్న టాప్‌ 2 డైరెక్టర్లతో పనిచేసిన అనుభవం అతడి సొంతం. జాతీయ స్థాయిలో అవార్డులు వచ్చిన సినిమాకి పనిచేశాడు. అయితే అతడికి తక్కువ కెరీర్‌లోనే బోలెడన్ని జీవిత పాఠాలు. అత్యంత వేగంగా గుణపాఠాలెన్నో అయ్యాయి. అందుకే వాటన్నిటినీ కెరీర్‌ ఎదుగుదలకు వాడుకుంటున్నాడిప్పుడు.

ఈ సంగతిని అతగాడే స్వయంగా చెప్పాడు. ఒక స్టార్‌ డైరెక్టర్‌ దగ్గర పనిచేశా. అతడు పని రాక్షసుడు. పనిని బాగా పిండుకుంటాడు. బాగా పేరు తెచ్చుకుంటాడు. అయితే ఆ పేరు తనకి మాత్రమే వస్తుంది. ఇంకెవరికీ ఏమీ మిగలదు. అలాంటి సన్నివేశంలో అతడి వద్ద మరోసారి పనిచేయాలంటే వెగటు పుట్టింది. అందుకే స్థానం మారాను. మరో స్టార్‌ డైరెక్టర్‌ దగ్గర పనిచేశా. అతడికి ఇతడికి ఎంత తేడా? అస్సలు పోలికే లేదు. తాను ఎదగాలి. తనతో పాటు అందరూ ఎదగాలి అని కోరుకునే గొప్ప మనస్తత్వం. అరుదైన వ్యక్తిత్వం. ఇలాంటి చోట పనిచేస్తే తప్పక ఎదుగుతాం.. అన్న నమ్మకం అందరికీ కలుగుతుంది.. అని స్వయం పాఠాలు చెప్పాడు.

అంతేకాదు మునుపటి దర్శకుడి దగ్గర .. తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయే ఓ భారీ సినిమాకి పనిచేసే అవకాశం వచ్చినా తృణప్రాయంగా వదులుకున్నా! ఎందుకంటే మూడేళ్లు లాక్‌ అయి పనిచేసినా కళాదర్శకుడికి కలిసొచ్చేదేం లేదక్కడ. అందుకే వదులుకున్నా.. అని చెప్పాడు. ఈ ఎపిసోడ్‌లో పేర్లేవో మీ ఊహకే వదిలేశాం. కనిపెట్టండి చూద్దాం.
Tags:    

Similar News