సితారకు మరో ప్రేమకథా చిత్రం రీమేక్ హక్కులు?
విజయం సాధించిన ఇరుగుపొరుగు సినిమాల రీమేక్ రైట్స్ కొనుక్కుని తెలుగులో రీమేక్ చేసేందుకు మన నిర్మాతలు ఉత్సాహం చూపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేటగిరీలోనే సితార ఎంటర్ టైన్ మెంట్స్ ఇంతకు ముందు `ప్రేమమ్` లాంటి మలయాళ చిత్రాన్ని రీమేక్ చేసింది. తెలుగు లోనూ ప్రేమమ్ ఘన విజయం సాధించింది.
తాజాగా మరో మలయాళ హిట్ చిత్రం `అయ్యప్పనుమ్ కోషియం`ని రీమేక్ చేసేందుకు సన్నాహకాల్లో ఉంది. ఇందు లో ఇద్దరు ప్రముఖ స్టార్లు నటించనున్నారని ప్రచారం అవుతోంది. అయితే అందుకు సంబంధించిన పూర్తి వివరాల్ని నిర్మాత నాగ వంశీ వెల్లడించాల్సి ఉంటుంది.
ఈ రీమేక్ గురించి ముచ్చట సాగుతుండగానే.. మరో మలయాళ సినిమా రీమేక్ హక్కుల్ని సితార సంస్థ చేజిక్కించుకుందని తెలుస్తోంది. అన్నా బెన్- శ్రీనాథ్ భాసి - రోషన్ మాథ్యూ నటించిన `కప్పేలా` ఇటీవలే రిలీజై ఘనవిజయం సాధించింది. యువతరం మెచ్చే లవ్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ ఇది. తెలుగులోనూ వర్కవుటవుతుందని సదరు సంస్థ భావిస్తోంది. అలాగే ఈ రీమేక్ బాధ్యతలు ఓ యువ దర్శకుడికి అప్పగిస్తున్నారని తెలుస్తోంది.
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ - సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థలు ఇటీవల వరుస సక్సెస్ లతో స్పీడ్ పెంచిన సంగతి తెలిసిందే. సితార ఎంటర్ టైన్ మెంట్స్ కంటెంట్ ఉన్న పరిమిత బడ్జెట్ చిత్రాల్ని నిర్మిస్తోంది. హారిక బ్యానర్ స్టార్ హీరోల తో సినిమాల్ని నిర్మిస్తోంది. రాధాకృష్ణ- నాగవంశీ బృందం క్రైసిస్ కాలం లోనూ భారీ ప్రణాళికల తో ముందుకు వెళుతున్న సంగతి తెలిసిందే.