హైద‌రాబాద్ లో వాలిపోయిన ముద్దుగుమ్ములు...!

Update: 2020-09-03 10:10 GMT
కరోనా మహమ్మారి కారణంగా గత ఐదు నెలలుగా సినీ ఇండస్ట్రీ గడ్డుకాలం ఎదుర్కుంటోంది. సినిమా షూటింగ్స్ ఎక్కడికక్కడ అర్ధాంతరంగా ఆగిపోయి.. థియేటర్స్ మూతబడిపోయి సినిమా విడుదలలు వాయిదా పడుతున్నాయి. ఇక షూటింగ్స్ లేకపోవడంతో నటీనటులు అందరూ ఇళ్లకే పరిమితమై ఫ్యామిలీస్ తో ఎంజాయ్ చేస్తూ వచ్చారు. అయితే ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ లో సడలింపులు ఇవ్వడంతో కొన్ని సినిమాలు సెట్స్ మీదకు వెళ్లాయి. టాలీవుడ్ లో కూడా స్టార్ హీరో హీరోయిన్స్ షూటింగులకు రెడీ అవుతున్నారు. ఇండోర్ షూటింగులకు ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లో ఉండే హీరోయిన్స్ ఇప్పుడు హైదరాబాద్ లో వాలిపోతున్నారని తెలుస్తోంది.

కాగా 'Rx బ్యూటీ' పాయ‌ల్ రాజ్ పుత్ త‌న అప్ క‌మింగ్ మూవీ ఫొటో షూట్స్ మరియు కొన్ని త‌మిళ సినిమాల‌కి సంబంధించిన ప‌నుల కోసం హైద‌రాబాద్ వ‌చ్చేసింది. ఇక్కడ బాలాన‌గ‌ర్ లో ఉన్న త‌న సొంత ఇంటిలోనే ఉంటూ ప‌నులు చూసుకుంటోందట. ఇక స్టార్ హీరోయిన్ కాజ‌ల్ అగర్వాల్ కూడా హైద‌రాబాద్ నే త‌న బేస్ గా చేసుకుంది. ప్రస్తుతం చేతి నిండా ప్రాజెక్ట్స్ పెట్టుకున్న కాజల్.. 'ఆచార్య' షూటింగ్ మొద‌లు పెట్టే అవ‌కాశం ఉండ‌టంతో కాస్ట్యూమ్ ట్రైల్స్ చేసుకుంటూ బిజీగా ఉందని సమాచారం. లక్కీ బ్యూటీ రష్మిక మందాన్న కూడా హైద‌రాబాద్ చేరుకుంది. ఆమె నటిస్తున్న 'పుష్ప' స్టోరీ డిస్క‌ష‌న్స్ మరియు వ‌ర్క్ షాప్స్ లో పార్టిసిపేట్ చేస్తోందని సమాచారం.

మరో స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే 'రాధే శ్యామ్' షూటింగ్ సెప్టెంబర్ సెకండ్ వీక్ లో స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో హైదరాబాద్ లో వాలిపోయింది. వీరితో పాటు నిధి అగ‌ర్వాల్ - నభా న‌టేశ్ వంటి బ్యూటీస్ హైదరాబాద్ లో మకాం వేసి త‌మ సినిమా షూటింగ్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే వీరిలో చాలా మంది త‌మ బంధువులు ఫ్రెండ్స్ ఇళ్లలో ఉంటూ ఈ క్రైసిస్ సమయంలో నిర్మాత‌ల‌కి లాడ్జింగ్ ఖ‌ర్చులు త‌గ్గిస్తున్నారని తెలుస్తోంది.
Tags:    

Similar News