ప్రియుడితో స్టార్ హీరో సిస్ట‌ర్ ఘాటైన లిప్ లాక్

Update: 2020-03-02 08:00 GMT
టైగర్ ష్రాఫ్ సోదరి కృష్ణ ష్రాఫ్ ఇస్పీడ్ గురించి తెలిసిందే. ప్రియుడు ఎబాన్ హైమ్స్ తో జంట షికార్లు చేస్తూ నిరంత‌రం మీడియా కు ట‌చ్ లో ఉంటోంది. ఈ జంట విదేశాల్లో ఒంట‌రి దీవుల సెల‌బ్రేష‌న్స్ కి సంబంధించిన ఫోటోల్ని ఎప్ప‌టిక‌ప్పుడు నెటిజ‌నుల‌కు షేర్ చేస్తూనే ఉన్నారు. తాజాగా దుబాయ్ అట్లాంటిస్ లోని ది ఫామ్ వద్ద ఈ జంట సెల‌బ్రేష‌న్స్ సాగుతున్నాయి. ఓ అంద‌మైన‌ ఫిష్ అక్వేరియం ముందు హాట్ క‌పుల్ ఇచ్చిన ఫోజు తాజాగా వైర‌ల్ అయ్యింది.

`సముద్రం లో నా ఫేవ‌రెట్ ఫిష్‌` అన్న‌ శీర్షికను ఈ ఫోటోకి ఇచ్చింది. కొద్ది రోజుల క్రిత‌మే కృష్ణ -ఎబాన్ జంట ఆస్ట్రేలియాలోని బోండి బీచ్ నుండి ఫోటోను షేర్ చేసిన అనంత‌రం ఈలోగానే ఇలా స‌రికొత్త ఫోటోతో ఫ్యాన్స్ ని చిలౌట్ చేశారు. ఎబాన్ ప్రొఫెషనల్ బాస్కెట్ బాల్ క్రీడాకారుడు కాగా కృష్ణ ఓ జిమ్ వోన‌ర్. ఎబాన్ ఆస్ట్రేలియన్ నేషనల్ బాస్కెట్ బాల్ లీగ్ (ఎన్‌.బి.ఎల్)లో ఆడాడు. యు.ఎల్‌.ఇ.బి పోటీల్లో ఆడిన తొలి భారతీయుడిగా రికార్డుల‌కెక్కాడు. ఇక కృష్ణ‌- ఇబాన్ ఇద్దరూ తమ మ‌ధ్య బాంధ‌వ్యం గురించి బహిరంగంగా చెబుతుంటారు. తరచూ ఫోటోలను సోషల్ మీడియా లో పంచుకుంటారు. ఇబాన్ ఇటీవల కృష్ణను `భార్య` అని సోషల్ మీడియాలో సంభాషించ‌డం హాట్ టాపిక్ అయ్యింది. ఆ వ్యాఖ్య‌తో ఇద్దరూ రహస్యం గా వివాహం చేసుకున్నారనే ఊహాగానాలకు దారితీసింది.

ప్ర‌ఖ్యాత‌ ముంబై మిర్రర్ తో కృష్ణ‌ మాట్లాడుతూ.. ``ఇది ఉల్లాసం క‌లిగించేదే. కేవలం ఒకే ఒక్క‌ పదం. మేం రహస్యంగా వివాహం చేసుకున్నామన్న‌ కథనాల‌కు కార‌ణ‌మైంది. ఇదంతా వేలం వెర్రి. నా మామ్ (ఆయేషా ష్రాఫ్) కూడా అస‌లేం జ‌రుగుతోందోన‌ని నన్ను అడిగారు`` అని తెలిపారు. ఎబాన్ సంగీతప్రియుడు క్రీడలలో ఆస‌క్తి ఉన్న‌వాడు. సినిమాలపై ఆసక్తి ఉన్నా కానీ.. ప్రస్తుతం అతను క్రీడల్లోకి వచ్చాడు.రాప్- హిప్ హాప్ లో స్పెష‌లిస్ట్. సొంతంగా సంగీత సాధ‌న‌ చేస్తాడు. అతను LA - ఆస్ట్రేలియాలో ప‌లు ప్రాజెక్టులలో పనిచేశాడు అని కృష్ణ గ‌డ‌గ‌డా త‌న‌కు తెలిసిన‌వ‌న్నీ చెప్పేసింది. అయితే పెళ్లి ఎప్పుడు? అన్న‌ది మాత్రం చెప్ప‌నే లేదు ఎందుక‌నో!
Tags:    

Similar News