• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  టికెట్ రేట్ల ఫైల్ పై సీఎం...

టికెట్ రేట్ల ఫైల్ పై సీఎం సంతకం.. 'రాధేశ్యామ్' కు లాభం చేకూరేనా..?

By - Tupaki Desk
Update: 2022-03-07 12:01 GMT
ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్‌ ధరల వ్యవహారం మీద గత 11 నెలలుగా చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. రేట్లు నియంత్రిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఇండస్ట్రీ అసహనం వ్యక్తం చేయడం.. సినీ పెద్దలు వెళ్లి సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డిని కలవడం.. ఈ క్రమంలో ఏపీ సర్కారు ఓ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది.

ఇటీవల కమిటీ సభ్యులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఫిబ్రవరి 24న టికెట్ రేట్ల సవరణ జీవో రావాల్సి ఉండగా.. అనివార్య కారణాల వల్ల ఆలస్యం అయింది. అయితే తాజాగా ముఖ్యమంత్రి జగన్‌ టికెట్‌ ధరల పెంపు ఫైల్‌ మీద సంతకం చేశారని తెలుస్తోంది.

సినిమా టిక్కెట్ ధరల అంశం మీద ఈరోజో రేపో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. ఈ వ్యవహారంపై హైకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఉన్నత న్యాయస్థానానికి సమాచారం ఇచ్చిన తర్వాత ప్రభుత్వం జీవో జారీ చేస్తారని అనుకుంటున్నారు.

ఇదే కనుక నిజమైతే సినీ ఇండస్ట్రీకి.. రానున్న రోజుల్లో విడుదలకు సిద్ధమైన భారీ చిత్రాలకు శుభ పరిణామమనే చెప్పాలి. ఏపీ సర్కారు జీవో ఈ రెండు రోజుల్లో వస్తే ముందుగా మార్చి 11న రిలీజ్ కాబోతోన్న 'రాధేశ్యామ్' చిత్రానికి హెల్ప్ అవుతుంది.

తాజాగా 'రాధేశ్యామ్' మూవీ ప్రమోషన్స్ లో ప్రభాస్ కి ఇదే విషయం మీద ప్రశ్న ఎదురైంది. ఏపీ సర్కారు మీ సినిమా టికెట్ ధరలపై ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నది అని ప్రశ్నించగా.. ''ఈ విషయలాన్ని మా నిర్మాతలు వంశీ - ప్రమోద్ చూసుకుంటున్నారు. అది వారినే అడగాలి'' అని ప్రభాస్ సమాధానమిచ్చారు.

ఇటీవల మీరు కూడా జగన్ ని కలిశారు కదా.. ఏం అనుకుంటున్నారు? అని అడగగా.. 'మంచి జరగాలనే కోరుకుంటున్నాం.. వస్తే బావుంటుంది' అంటూ ప్రభాస్ బదులిచ్చారు. ఇకపోతే టికెట్ రేట్ల అంశం మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని దర్శక నిర్మాతలు విజ్ఞప్తి చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

గతంలో చిరంజీవి - మహేష్ బాబు - ప్రభాస్ వంటి సినీ ప్రముఖులు జగన్ తో భేటీ అయిన సమయంలో పెద్ద సినిమాలు - 100 కోట్ల బడ్జెట్ దాటిన సినిమాలకు ఎక్కువ రేట్లు టికెట్లు అమ్ముకునే విధానం పరిశీలిస్తున్నామని జగన్ స్వయంగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అలాంటి అవకాశం ఏదైనా కల్పించాలని 'రాధేశ్యామ్' మేకర్స్ కోరినట్లు తెలుస్తోంది. మరి రిలీజ్ లోపు ఏపీ సర్కారు జీవో జారీ చేసి ప్రభాస్ చిత్రానికి సపోర్ట్ చేస్తుందేమో చూడాలి.
Tags:    
  • Prabhas 
  • Pooja Hegde 
  • Radheshyam 
  • Tollywood 
  • Movie News 
  • Latest News 
  • Telugu News 

Similar News

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS