చైతూకు జోడీగా ముగ్గురు ముద్దుగుమ్మలు

Update: 2020-12-13 07:45 GMT
అక్కినేని హీరో నాగచైతన్య ఇటీవలే 'లవ్‌ స్టోరీ' సినిమా షూటింగ్ ను ముగించేశాడు. చైతూ తదుపరి సినిమా 'థ్యాంక్యూ' అంటూ ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది. ఈ నెలలో సినిమాను పట్టాలెక్కించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. కాని కాస్త ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయనిపిస్తుంది. విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో రూపొందబోతున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మించబోతున్నాడు. బివిఎస్‌ రవి కథ తో ఈ సినిమాను విక్రమ్‌ కుమార్‌ తనదైన శైలిలో ఎంటర్‌ టైనర్‌ గా విభిన్నమైన స్క్రీన్‌ ప్లేతో నడిపించబోతున్నాడు.

కథానుసారంగా ఈ సినిమాలో హీరో ఒక పల్లెటూరు వ్యక్తిగా మరియు ఎన్నారై గా కూడా కనిపించబోతున్నాడు. చైతూకు జోడీగా ఈ సినిలో ఏకంగా ముగ్గురు ముద్దుగుమ్మలు నటించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఇద్దరు ముద్దుగుమ్మలను ఎంపిక చేసిన దర్శకుడు మూడవ హీరోయిన్‌ విషయమై చర్చలు జరుపుతున్నాడట. ఏకంగా ముగ్గురు ముద్దుగుమ్మలతో చైతూ నటించడం మొదటి సారి. ఈ సినిమాను వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే మనం సినిమాతో చైతూ మరియు విక్రమ్‌ ల కాంబో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు థ్యాంక్యూ తో ప్రేక్షకుల ముందుకు ఈ కాంబో రాబోతుంది.
Tags:    

Similar News