బాలు కోసం పోరాడిన జగపతి రాజేంద్రప్రసాద్
ఈ నేపథ్యంలో 1974లో జగపతి సంస్థ నిర్మించిన మంచి మనుషులు మూవీలో హీరోగా శోభన్ బాబుని చిత్ర నిర్మాత రాజేంద్ర ప్రసాద్ తీసుకున్నారు.;
తెలుగు సినిమా రంగంలో తారాపథంలో రాణించడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు, ఎంతో ప్రతిభ ఉన్నా కూడా కాలం కలిసి రావాలి. ప్రతిభను గుర్తించి ప్రోత్సహించే వారి అండ దండ కావాలి. గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విషయమే తీసుకుంటే ఆయన తొలి దశలో తన గానంతో రాణించినా గాయకుడిగా ఎస్టాబ్లిష్ కావడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చింది. ఒక దశలో సినీ పరిశ్రమ నుంచి వెళ్ళిపోదామని అనుకున్న నేపథ్యం కూడా ఉంది. అపుడు హీరో కృష్ణ ఆయనను తన సినిమాలకు పాడుదురుగానీ అని హామీ ఇచ్చి మరీ ప్రోత్సహించారు అది బాలు అనేక సందర్భాలలో చెప్పి ఉన్నారు కూడా.
టాప్ హీరోలు నో :
ఇక బాలూకి ఒక టైం లో ఆనాటి టాప్ హీరోలు అంతా తమకు పాడేందుకు అవకాశాలు ఇవ్వలేదు. వారు అప్పటికే కొత్త గొంతుకగా పరిచయం అయి అచ్చం ఘంటసాల మాదిరిగా అనుకరించి పాడుతున్న రామకృష్ణ వాయిస్ తోనే తమ సినిమాలు హిట్ అవుతున్నాయని భావించి బాలూని దూరం పెట్టారు. అలా అక్కినేని ఎన్టీఆర్, శోభన్ బాబు కృష్ణంరాజు అందరూ రామకృష్ణ చేత పాడించుకునేవారు. దాంతో బాలూకి అవకాశాలు చాలా వరకూ తగ్గిపోయాయి. దాంతో ఆయన హీరో క్రిష్ణకు మాత్రమే పాడేవారు. వీలైతే చిన్న హీరోలకు కమెడియన్లకు పాడుతూ మంచి చాన్సుల కోసం వేచి చూసేవారు
పట్టుబట్టి పాడించారు :
ఈ నేపథ్యంలో 1974లో జగపతి సంస్థ నిర్మించిన మంచి మనుషులు మూవీలో హీరోగా శోభన్ బాబుని చిత్ర నిర్మాత రాజేంద్ర ప్రసాద్ తీసుకున్నారు. హీరోయిన్ గా మంజుల ఫిక్స్ అయింది. ఇతర టాప్ తారాగణం అంతా సినిమాకు ఎంపిక చేశారు. ఇక జగపతి వారి ఆస్థాన టెక్నీషియన్స్ గా ఉన్న కేవీ మహదేవన్ ఆచార్య ఆత్రేయలతో మంచి పాటలు చేయించాలని ఒక మంచి మ్యూజికల్ ఆల్బం గా నిలిచిపోవాలని ఆ సినిమాకు దర్శకుడు కూడా అయిన రాజేంద్ర ప్రసాద్ ఆలోచించారు దాంతో తన సినిమాకు పాటలన్నీ పాడే చాన్స్ ఎస్పీ బాలూకి ఇచ్చారు. అలా జగపతి సంస్థకు బాలూ పాడడం తొలిసారి కూడా.
నో చెప్పినా కూడా :
ఇక ఆ సినిమా హీరో శోభన్ బాబు అయితే తన సినిమాలకు రామకృష్ణ మాత్రమే పాడాలని కోరారు. ఆయన గొంతుక తనకు బాగా సూట్ అవుతుందని ఆయన భావించి ఆ విధంగా కోరారు అన్న మాట. ఆయనకు మంచి హిట్లు కూడా రామకృష్ణ పాటలతో రావడంతో అదే కంటిన్యూ చేయాలనుకున్నారు అయితే నిర్మాత కం దర్శకుడు అయిన రాజేంద్ర ప్రసాద్ ససేమిరా అన్నారు. తన సినిమాకు బాలూ పాడతారు అని కచ్చితంగా చెప్పేశారు. పైగా ఆ సినిమా సూపర్ హిట్ అవుతుందని మ్యూజికల్ గా హిట్ అవుతుందని కూడా చెప్పారు. దాంతో కన్విన్స్ అయిన శోభన్ బాబు ఒప్పుకున్నారు అలా మంచి మనుషులు మూవీలో శోభన్ బాబుకు అన్ని పాటలు బాలూ పాడి సూపర్ హిట్ చిత్రంలో భాగం అయ్యారు ఇప్పటికి యాభై రెండేళ్ళు అవుతున్నా ఆ సినిమాలో పాటలు ఎవర్ గ్రీన్. మరో విషయం ఏంటంటే ఆ మూవీ తరువాత శోభన్ బాబుకు అన్ని సినిమాలూ బాలూయే పాడడం ఫ్యాన్స్ సైతం దానిని అంగీకరించడంతో ఆయన దశ మారిపోయింది.
గుర్తుంచుకున్న బాలు :
అయితే తాను కష్టకాలంలో ఉన్నపుడు స్టార్ హీరోల సినిమాలకు పాటలు పాడించడంతో జగపతి సంస్థ నిర్మాత రాజేంద్ర ప్రసాద్ ఇచ్చిన మద్దతు ఈ విషయం ఏకంగా హీరోనే కన్వీన్స్ చేసిన తీరుని ఎప్పటికీ మరచిపోలేనని పలు సందర్భాలలో బాలూ చెప్పారు కూడా. తన లాంటి ఒక అప్ కమింగ్ సింగర్ కోసం పోరాడాల్సిన అవసరం అప్పటికే టాప్ ప్రొడ్యూసర్ గా ఉన్న ఆయనకు అవసరం లేదని బాలు అంటూండేవారు ఏది ఏమైనా సినీ సీమలో ఇలాంటి సంఘటనల వల్ల కొందరి టాలెంట్ మాత్రమే కాదు మరి కొందరి గొప్పదనం కూడా బయటపడుతుంది.