రానాలో ఆ క్వాలిటీస్ వేరొకరిలో చూడలేం
తెలుగులో తెలుగు భాష మాట్లాడేందుకు చదివేందుకు ఇష్టపడే హీరోలు ఎవరైనా ఉన్నారా? అంటే .. నేటితరంలో యువహీరో రానా పేరు వినిపిస్తోంది. రానాకు ఆన్ లొకేషన్ స్క్రిప్ట్ పేపర్ ఏదైనా కానీ తెలుగులోనే అందివ్వాలి. ఈ మాట చెప్పినది ఎవరు? అంటే .. ప్రస్తుతం విరాఠపర్వం చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న వేణు ఉడుగుల రానా గురించి ప్రతిదీ పూస గుచ్చినట్టు చెప్పారు.
రానా తెలుగు అభిమాని. తెలుగు లోనే డైలాగుల వెర్షన్ చేతికి ఇవ్వాలని అడుగుతారు. స్క్రిప్టు ప్రతుల్ని తెలుగులోనే ఇష్టపడతారు. ఆంగ్లంలో స్క్రిప్టు డైలాగులు అవసరం లేదని చెబుతారు... అంటూ రానా మాతృభాష ఆసక్తిని వివరించారు.
సెట్స్ కెళ్లక ముందు రానా స్క్రిప్టింగ్ ప్రక్రియలో పాల్గొంటాడు. అతను సెట్స్ లోకి వచ్చాక దర్శకుడి నటుడు.. స్క్రిప్ట్ లో జోక్యం చేసుకోడు. అతను తన దర్శకుడు చెప్పేది వింటాడు. స్టార్ ని అనే గర్వం లేకుండా చెప్పిందే చేస్తారు.. అని తెలిపారు. ఆరంభం తెలుగును ఆంగ్లంలో రాసి ఇస్తే అలా వద్దని తెలుగులోనే కావాలని అడిగారు. అలాంటి హీరోలు చాలా అరుదు అని కూడా అన్నారు.