• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  టాలీవుడ్: ప్యాన్ ఇండియా...

టాలీవుడ్: ప్యాన్ ఇండియా భవితను తేల్చేది ఆ సినిమాలే

By - Tupaki Desk
Update: 2020-04-10 02:45 GMT
తెలుగు సినిమాల కంటే తమిళ సినిమాల రేంజ్..రీచ్ ఎక్కువ. వాటికంటే హిందీ సినిమాల రీచ్ ఎక్కువ.. బడ్జెట్ లు ఎక్కువ. ఇది 'బాహుబలి' కి ముందు  ఉన్న అభిప్రాయం. అయితే ' బాహుబలి' తర్వాత ఆ హద్దులు అన్నీ చెరిగిపోయాయి. కంటెంట్ ఉంటే చాలు.. ఏ భాషా చిత్రమైనా దేశవ్యాప్తంగా ఘన విజయం సాధిస్తుందని.. దేశవ్యాప్తంగా సినీ ప్రేమికులు బ్రహ్మరథం పడతారని తేలిపోయింది. దీంతో ప్యాన్ ఇండియా సినిమాల జోరు పెరిగింది.  ప్రభాస్ 'సాహో' సౌత్ లో నిరాశ పరిచింది గాని హిందీ లో మాత్రం దుమ్ము రేపింది. 'సైరా' విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాలకు అవతల ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది.

నిజానికి ఈ రెండు సినిమాల ఫలితం టాలీవుడ్ లో ప్యాన్ ఇండియా సినిమాలు ప్లాన్ చేస్తున్న నిర్మాతలను ఆలోచనల్లో పడేసింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం దాదాపు నాలుగు సినిమాలు పాన్ ఇండియా మార్కెట్ టార్గెట్ చేస్తున్నాయి. ఈ సినిమాల జయాపజయాలు టాలీవుడ్ లో భవిష్యత్తులో తెరకెక్కబోయే పాన్ ఇండియా సినిమాల భవిష్యత్తును నిర్ణయిస్తాయి.

ఆ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోదగినవి నాలుగు ప్రాజెక్టులు. మొదటిది రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న RRR. ఈ సినిమా ప్యాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది. అంచనాలు కూడా భారీగా ఉన్నాయి. రామ్ చరణ్.. ఎన్టీఆర్ ఇద్దరూ ప్రభాస్ తరహాలో హిందీ ప్రేక్షకులను మెప్పించగలరా అనేది వేచి చూడాలి. ఇప్పటివరకు అయితే ఈ సినిమా రాజమౌళి బ్రాండ్ మీదనే పాన్ ఇండియా సినిమాగా చలామణి అవుతోంది.

ఇక ఈ సినిమాతో పాటు ప్రభాస్ కొత్త సినిమా 'జాన్' కూడా ప్యాన్ ఇండియా సినిమానే.  విజయ్ దేవరకొండ - పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'ఫైటర్' కూడా ప్యాన్ ఇండియా స్థాయిలోనే రిలీజ్ చేస్తున్నారు. ఇక తాజాగా ఈ జాబితాలోకి అల్లు అర్జున్ సుకుమార్ సినిమా 'పుష్ప' కూడా వచ్చి చేరింది. అల్లు అర్జున్ కూడా ప్యాన్ ఇండియా పై కన్నేసిన సంగతి నిన్న ఫస్ట్ లుక్ పోస్టర్లు రిలీజ్ అయిన సమయంలోనే  అర్థం అయింది. ఈ సినిమాలలో కనీసం రెండు సినిమాలు కనుక దేశవ్యాప్తంగా విజయం సాధిస్తే టాలీవుడ్ స్టార్ హీరోలు అందరూ ఇకపై తమ సినిమాలను తెలుగుకు మాత్రమే పరిమితం చేయకుండా దేశవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు సిద్ధ పడడం ఖాయం. అలా కాకుండా ఈ సినిమాలు కనుక మిగతా భాషల్లో నిరాశ పరిస్తే ప్యాన్ ఇండియా కలలకు ఫుల్ స్టాప్ పడ్డట్టే. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.
Tags:    
  • Vijay Devarakonda 
  • Prabhas 
  • Allu Arjun 
  • Ram Charan 
  • Ntr 
  • RRR 
  • Fighter 
  • Jaan 
  • Pushpa 
  • Telugu Pan Indian Movies 
  • Tollywood Latest Updates 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS