మెగా అల్లు గ్యాప్ ఇందుకేనా

Update: 2019-10-14 08:56 GMT
చిరంజీవి మెగాస్టార్ గా ఎదగడంలో అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ బ్యానర్ పాత్ర ఎంతైనా ఉంది. చిరు కెరీర్ పీక్స్ కు చేరడానికి అప్పట్లో ఈ కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్లు చాలా దోహద పడ్డాయి. ఆ తర్వాత కొంత నెమ్మదించినా గీత ఆర్ట్స్ నిర్మాణాలు కొనసాగించింది. మేనల్లుడు రామ్ చరణ్ మగధీరకు అరవింద్ పెట్టిన బడ్జెట్ చూసి అందరూ నోరెళ్ళబెట్టారు. ఇదంతా గతం.

ఇప్పుడు చిరంజీవితో సినిమా చేయాలంటే అరవింద్ అంతటివాడే వెయిట్ చేయాల్సిన పరిస్థితి. 150వ సినిమా అనుకుంటే చరణ్ నాన్న ల్యాండ్ మార్క్ కాబట్టి నేనే తీస్తా అని కొణిదెల బ్యానర్ పెట్టి హిట్టు కొట్టేశాడు.పోనీ 151 అనుకుంటే సైరా డ్రీం ప్రాజెక్ట్ కనక ఇది నేనే చేస్తానని రెండు వందల కోట్ల బడ్జెట్ పెట్టేసి తెలుగు రాష్ట్రాల్లోనే బ్లాక్ బస్టర్ కొట్టేశాడు. బయట సైరా ఆడకపోయినా ఓవరాల్ గా ఫ్లాప్ ముద్ర తప్పించుకుంది .ఇక ఇప్పుడు 152 వంతు వచ్చింది. ఇదీ కొణిదెల బ్యానర్ తో మ్యాట్నీ సంస్థ జంట నిర్మాణంలో రూపొందుతోంధి. ఇక్కడా అల్లు అరవింద్ లేరు.

ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ కారణం వల్లే మెగా అల్లు కాంపౌండ్ ల మధ్య బయటికి కనిపించని గ్యాప్ ఏదో ఉందని మాట్లాడుకుంటున్నారు. అందువల్లే గతంలోలాగా జంట పెట్టుబడులు చేయకుండా చరణ్ సోలోగా ప్రొడక్షన్ చేస్తున్నాడని అందుకే బన్నీ కూడా తన దారి తనదే అనే రీతిలో వెళ్తున్నాడని సదరు టాక్ సారాంశం. ఇవన్నీ నిజమో కాదో నిర్ధారణగా చెప్పలేకపోయినా సైరా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో అల్లు అరవింద్ తనకు ఇప్పుడు చిరంజీవితో సినిమా నిర్మించే ఛాన్స్ రావడం లేదన్న రీతిలో ఇన్ డైరెక్ట్ గా ప్రస్తావించడం ఇలాంటి వాటికి బలం చేకూరుస్తోంది. లోగుట్టు మనకేం తెలుసు.
Tags:    

Similar News