తైవాన్ మంత్రికి ఇష్టమైన సినిమా మనదే
టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి రెండు పార్ట్ లు కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. కేవలం తెలుగు భాషలో.. ఇండియన్ భాషల్లోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఆయా భాషల్లో విడుదల అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా జపాన్.. తైవాన్ లతో పాటు మరికొన్ని దేశాల్లో బాహుబలి సినిమాకు వీరాభిమానులు ఉన్నారు. సినిమాలో నటించిన ప్రతి ఒక్కరిని వారు అక్కడ గుర్తు పెట్టుకుని మరీ ఇంకా అభిమానిస్తూనే ఉన్నారు. ప్రభాస్ పుట్టిన రోజుకు అక్కడ వేడుకలు జరుగుతాయి అంటే అతిశయోక్తి కాదు. అలాంటి బాహుబలి సినిమా తైవాన్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రికి చాలా ఇష్టమట.
తాజాగా ఒక ఇండియన్ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తైవాన్ మంత్రి జోసెఫ్ హు మాట్లాడుతూ ఇండియన్ సినిమాల్లో నాకు అత్యంత ఇష్టమైన మూవీ బాహుబలి. టీవీలో ఎప్పుడు వచ్చినా కూడా పూర్తి అయ్యే వరకు ఛానెల్ మార్చవద్దని నా భార్యతో అంటూ ఉంటాను. సినిమా టీవీలో వచ్చిన ప్రతి సారి చూస్తూనే ఉంటాను అన్నాడు. బాహుబలి రెండు పార్ట్ లు కూడా తనకు ఇష్టమని ఆయన పేర్కొన్నాడు. బాహుబలి రెండు సినిమాలతో పాటు ఇండియన్ సినిమాల్లో దంగల్ మరియు హిందీ మీడియం సినిమాలు కూడా ఇష్టమే అన్నాడు. విదేశీయులను ఏ స్థాయిలో బాహుబలి ఆకట్టుకుందో మంత్రి వ్యాఖ్యలతో అర్థం చేసుకోవచ్చు.