'ఓటిటి'లో ఏప్రిల్ మొత్తం కొత్త సినిమాల సందడి..

Update: 2020-04-16 01:30 GMT
ఈ మధ్యకాలంలో సినిమావాళ్లకు థియేట్రికల్ హక్కులతో పాటు డిజిటల్ - శాటిలైట్ హక్కుల రూపంలో బాగానే వర్కౌట్ అవుతుంది. ముఖ్యంగా అమెజాన్ ప్రైమ్ - సన్‌ నెక్ట్స్ వంటి డిజిటల్ ఫ్లాట్‌ ఫామ్ వచ్చాకా.. సినిమా థియోటర్స్‌ లో నడుస్తూ ఉండగానే అమెజాన్ ప్రైమ్‌‌ - జీ 5 - సన్‌ నెక్ట్స్‌ లో రిలీజ్ అవుతున్నాయి. ఒక రకంగా డిజిటల్ రైట్స్ రూపంలో నిర్మాతలకు బాగానే వర్కౌట్ అయినా.. డిస్ట్రిబ్యూటర్స్‌ కు మాత్రం ఒక సినిమా నడుస్తుండగా ఓటీటీ ఫ్లాట్‌ పామ్‌ లో విడుదల కావడం ఎంతో కొంత నష్టాన్ని తెచ్చిపెడుతోంది. అందుకే ఈ మధ్యకాలంలో పెద్ద సినిమాలు రిలీజ్‌ కు ముందు ఆయా ఓటీటీ ఫ్లాట్‌ ఫామ్స్‌ తో ఒప్పందం చేసుకుంటున్నాయి.

తాజాగా విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న 'వరల్ట్ ఫేమస్ లవర్' సినిమా ఏప్రిల్ 15న సన్‌ నెక్ట్స్‌లో స్ట్రీమ్ కానున్నట్టు సన్ నెక్ట్స్ ప్రకటించింది. అలాగే దుల్కర్ సల్మాన్ రీసెంట్ సూపర్ హిట్ 'కనులు కనులను దోచాయంటే' సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో ఈ నెల 17న విడుదల కానుంది. యంగ్ హీరో నాగశౌర్య కథ అందించి నటించిన సినిమా 'అశ్వథామ'. థియేటర్లలో ఈ సినిమా నిరాశ పరిచినా సన్ నెక్స్ట్ లో సందడి చేయడానికి ఈ నెల 24న ప్రసారం కానుంది.

ఇక హీరో నితిన్ చాలా కాలంగా మంచి హిట్ కోసం ఎదురుచూస్తుండగా 'భీష్మ' సినిమాతో ఆ దాహం తీరింది. బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా ఈ నెల 27న సన్ నెక్స్ట్ లో ప్రసారం అవబోతుంది. ఇక భారీ అంచనాలతో బరిలోకి దిగిన బాలయ్య 'రూలర్' సినిమా థియేటర్లలో నిరాశ పర్చింది. కానీ ఓటిటిలో ఎంటర్ టైన్ మెంట్ అందించడానికి సన్ నెక్స్ట్ లో త్వరలోనే సందడి చేయనున్నట్లు సమాచారం. ఈ ఏప్రిల్ నెల మొత్తం కొత్త సినిమాలతో ప్రేక్షకులను ఓటిటి ప్లాట్ ఫామ్స్ అలరించనున్నాయి.
Tags:    

Similar News