ఆ దర్శకుడితో రాంచరణ్ సినిమా ఉన్నట్లా.. లేనట్లా..??

Update: 2020-12-24 07:35 GMT
ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియన్ సినిమా ఆర్ఆర్ఆర్. స్టార్ హీరోలు ఎన్టీఆర్.. రాంచరణ్ ప్రధాన పాత్రలలో నటిస్తుండగా.. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో డివివి దానయ్య నిర్మిస్తున్నాడు. ఇక హీరోయిన్లుగా అలియా భట్, ఒలీవియా మోరిస్ లతో పాటు బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఇంత భారీ తారాగణంతో రూపొందిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. అయితే ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్.. త్రివిక్రమ్ దర్శకత్వంలో అయినను పోయిరావాలె హస్తినకు అనే సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. కానీ ఇప్పటి వరకు మెగా పవర్ స్టార్ రాంచరణ్ తదుపరి సినిమా విషయంలో క్లారిటీ రాలేదు. అయితే ఇటీవల కథనాల ప్రకారం.. రాంచరణ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లితో నెక్స్ట్ మూవీ చేయనున్న వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ విషయం తెలిసి మెగా అభిమానులు సోషల్ మీడియాలో చేసిన హల్చల్ అంతా ఇంతా కాదు.

అంత ఓకే అయిపోయింది అనుకుంటున్న టైంలో ఇప్పుడు మరో వార్త సినీ వర్గాలలో తెగ వినిపిస్తుందట. అదేంటంటే.. రాంచరణ్ - వంశీ పైడిపల్లి కాంబినేషన్ మూవీ ఇప్పట్లో పట్టాలెక్కేలా కనిపించడం లేదట. ఎందుకంటే రాంచరణ్, వంశీ కాంబినేషన్ సెట్ చేయాలనీ ప్రొడ్యూసర్ దిల్ రాజు తెగ ట్రై చేస్తున్నా.. వీరిద్దరి నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో సైలెంట్ అయ్యాడట. అయితే వంశీ స్క్రిప్ట్ మహేష్ ఇప్పట్లో కుదరదు అని చెప్పేసరికి.. అది కాస్త రాంచరణ్  వరకు చేరిందట. అయితే రాంచరణ్ ఆర్ఆర్ఆర్, ఆచార్య సినిమాల తర్వాత యూవి విక్కీతో ఓ సినిమా చేయాలనీ అనుకుంటున్నట్లు తెలుస్తుంది. అదే విధంగా వంశీ కూడా ఓటిటి ప్రాజెక్ట్ లతో బిజీ ఉన్నాడట. మరి రాంచరణ్ బిజీలో ఉంటే వంశీ మాత్రం ఏం చేస్తాడు.. మహేష్ తోనే ఆ ప్రాజెక్ట్ ఎలాగైనా చేయాలనీ ఫిక్స్ అయినట్లు ఇండస్ట్రీ టాక్. ఇదే నిజమైతే వీరిద్దరి కలయికలో కొత్త ఉంటుందా లేదా అనేది తెలియాలంటే కొంతకాలం వెయిట్ చేయాల్సిందే.
Tags:    

Similar News