ఏమైనా ప్రియాంక ఫిలాసపీలో ఫాలో కావాల్సిన పాయింట్లు ఉన్నాయ్
అందచందాలతో కోట్లాది మంది మనసుల్ని దోచేసి..తన నటనతో చెరగని ముద్ర వేసిన ప్రియాంక చోప్రాకు సంబంధించి మరిన్ని యాంగిల్స్ ఉన్నాయి. గ్లామర్ ఫీల్డ్ లో ఉన్నప్పటికి ఆమె ఫిలాసఫీతో అదరగొట్టేస్తారు. తన జీవితంలో తాను పాటించే అంశాల్ని ఆమె చెబుతున్నారు. ఆమె తత్త్వం విన్నంతనే.. అందులో కొన్నింటిని ఆచరించాలన్న భావన కలుగక మానదు.
తన జీవితంలో తాను అనుసరించే వాటి గురించి.. కొన్ని అంశాల విషయంలో తాను ఆలోచించే తీరును ఆమె చెప్పుకున్నారు. అందులోని కొన్ని ముఖ్యాంశాల్ని చూస్తే..
- జీవితం నీకు నిమ్మకాయలను ఇస్తే వాటితో ద్రాక్షరసం చేయడానికి ట్రై చేయ్. తర్వాత నిశ్శబ్దంగా ఉండు. మనకు దక్కినవాటి నుంచి ఏదైనా అద్భుతం చేయడమన్న మాట. ఆ తర్వాత ఆశ్చర్యపోవడం.. ఈ అద్భుతం ఎలా జరిగిందా? అని ఆలోచించడం పక్కవారి పని.
- ఆత్మవిశ్వాసం, మన ప్రతిభపై నమ్మకం ఉన్నప్పుడు ఏదైనా సాధ్యమే. ఏదీ కష్టం కాదు.
- నువ్వెంత సాధించగలవో ఎవరూ చెప్పరు. అది నువ్వే గుర్తించి, ఉన్నత స్థాయికి చేరుకోవాలి.
- ఒంటరి ప్రయాణానికి భయపడకు. నీ విజయాలతో పాటు అపజయాలకూ నీవే బాధ్యత వహించు.
- సాధించాలనుకున్న దాని కోసం ఎంతైనా కష్టపడతాను. లక్ష్యానికి చేరువగా ఉన్నా షార్ట్‌కట్ వద్దు.
- నీతో నువ్వు నిజాయితీగా ఉండు. నిన్ను నువ్వు అంగీకరించు. నిన్ను నువ్వు ప్రేమించుకో. ధైర్యాన్ని కోల్పోకు.
- ఆత్మవిశ్వాసమే నా ఆభరణం. దీన్నే నేను అందరికీ రికమెండ్ చేస్తాను.
- నా కుటుంబమే నా బలం, నా బలహీనత.
- ప్రతి విషయాన్ని మనం కంట్రోల్ చేయలేం. కానీ.. శక్తివంచన లేకుండా వచ్చిన ఛాన్సును వందశాతం సద్వినియోగం చేసుకోవడం మన చేతుల్లోనే ఉంది.
- మనం ఎక్కువగా పక్కవారి గురించే ఆలోచిస్తుంటాం. వారు చేసే ప్రతి పని వెనక ఏదో ఒక ఎజెండా ఉందని భావిస్తాం. అలాంటి వాటిని మానుకుందాం.