మాస్ ఇమేజ్ ఉందని భావిస్తూ క్లాస్ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్న యువ హీరో..!

Update: 2020-11-06 03:30 GMT
సినిమాలతో కంటే తన యాటిట్యూడ్ తో వివాదాస్పద వ్యాఖ్యలతో గుర్తింపు తెచ్చుకున్నాడు ఒక టాలీవుడ్ యువ హీరో. ఫస్ట్ సినిమా ప్రేక్షకులకు తెలిసేలోపే థియేటర్స్ నుంచి వెళ్లిపోయింది. అయితే ఆ తర్వాత వచ్చిన సినిమాతో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ తో ఓ వర్గం ఆడియన్స్ కి దగ్గరయ్యాడు. ఈ క్రమంలో హోమ్ బ్యానర్ లో తాను నటించే సినిమాకి దర్శకత్వం కూడా వహించాడు. ఈ సినిమా కంటెంట్ ఎలా ఉన్నా కొందరిని మెప్పించగలిగింది. అదే సమయంలో మరో హీరో ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన సినిమాలో నటించాడు. ఇది అతనికి మంచి పేరునే తెచ్చిపెట్టినప్పటికీ ఆశించిన స్థాయిలో డబ్బులు మాత్రం రాబట్టలేకపోయింది. దీంతో ఆ సినిమా హిట్ కి ప్లాపుకి మధ్యలో నిలిచిపోయింది.

అయితే ఇన్నాళ్లు తనకు మాస్ ఇమేజ్ ఉందని భావిస్తూ వచ్చిన సదరు హీరో ఇప్పుడు క్లాస్ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్నాడ‌ని తెలుస్తోంది. యంగ్ హీరో ఇటీవల కొత్త దర్శకుడితో ఓ సినిమా అనౌన్స్ చేశాడు. వెరైటీ టైటిల్ తో రాబోతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభమైంది. ఇక ఈ సినిమాతో ల‌వ‌ర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకోవాల‌ని ట్రై చేస్తున్న హీరో.. దానికి తగ్గట్టే స్టోరీని ఎంచుకున్నాడు. హీరో తొమ్మిది మంది అమ్మాయిలతో లవ్ లో పడే కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కుతుందని సమాచారం. దీనికి తగ్గట్టే హీరో లుక్ ని కూడా మార్చేశాడు. అయితే అలాంటి కాన్సెప్ట్ తో ఇంతకముందు వచ్చిన సినిమాలన్నీ ఘోరంగా ఫెయిల్ అయ్యాయి. మరి ఇప్పుడు యువ హీరోకి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.
Tags:    

Similar News