ప్ర‌పంచం ఈ వండ‌ర్ ఉమెన్ అందానికి దాసోహం

Update: 2020-12-22 11:30 GMT
ప్ర‌ఖ్యాత హాలీవుడ్ న‌టి గాల్ గాడోట్ అందం ప్ర‌తిభ గురించి ప్ర‌త్యేకించి ప‌రిచ‌యం చేయాల్సిన ప‌నే లేదు. ఇప్ప‌టికే వండ‌ర్ ఉమెన్ గా కుర్ర‌కారు గుండెల్లో కొలువై ఉంది. త‌న‌దైన అందం చాకులాంటి న‌ట ప్ర‌ద‌ర్శ‌న‌తో గాల్ గాడోట్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా వీరాభిమానుల్ని సంపాదించింది. ఇటు తెలుగు బెల్ట్ లోనూ ఈ భామ‌కు ఫ్యాన్సున్నారు. అందుకు త‌గ్గ‌ట్టే మ‌ల్టీప్లెక్సుల్లో ఇంతటి క‌ల్లోలంలోనూ `వండర్ వుమన్ 1984` మూవీ ఆద‌ర‌ణ ద‌క్కించుకుంటోందిట‌.

ఈ మూవీకి ఇక గాల్ గాడోట్ పారితోషికం గురించి తెలిసినా షాక్ తినాల్సిందే. ఒక ర‌కంగా ఆమె నటించిన చిత్రం నుండి దాదాపు వైదొల‌గేందుకు ద‌ర్శ‌కులు పాటీ జెంకిన్స్ సిద్ధ‌మ‌య్యారంటే అర్థం చేసుకోవాలి. ఇటీవలి ఇంటర్వ్యూలో పాటీ జెంకిన్స్ సమాన వేతన సమస్యలపై వండర్ వుమన్ 1984 దర్శకత్వం నుండి దాదాపుగా దూరంగా ఉన్నట్లు వెల్లడించారు.

``నేను మరొక స్టూడియోకి వెళ్లి పావు వంతు సంపాదించడం ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే ఇది సూత్రప్రాయంగా సీక్వెల్ మూవీ కాదు. ఏమి ఇబ్బంది లేదు`` అంటూ ప్యాటీ ఈగోకి వెళ్లారు మ‌రి. త‌న వ్యాఖ్య‌ల‌కు గాల్ గాడోట్ కౌంట‌ర్ వేసింది “మొదటి సూపర్ హీరో సినిమా కోసం నాకన్నా ఏడు రెట్లు ఎక్కువ చెల్లించారు త‌న‌కు. రెండవదానిలో వారు నాకన్నా ఎక్కువ జీతం పొందారు`` అంటూ ఘ‌ర్ష‌ణ ప‌డింది. పాటీ  హాలీవుడ్ ‌లో అత్యధిక పారితోషికం తీసుకున్న మహిళా దర్శకురాలిగా పాపులారిటీ ఉంది. ఇక ఈ ఫ్రాంఛైజీలో తొలి సినిమా ఘ‌న‌విజ‌యం సాధించ‌డంతో గాల్ గాడోట్ అమాంతం పారితోషికం పెంచేసింది.
Tags:    

Similar News