ఇండియా డైరీస్ లో గ్లోబ‌ల్ బ్యూటీ స్మృతులు

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా విదేశాల్లో స్థిర‌ప‌డినా? మూలాలను, భారతీయ సంస్కృతిని ఎప్పటికీ మర్చిపోర‌ని మరోసారి నిరూపించారు.;

Update: 2026-04-19 02:45 GMT

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా విదేశాల్లో స్థిర‌ప‌డినా? మూలాలను, భారతీయ సంస్కృతిని ఎప్పటికీ మర్చిపోర‌ని మరోసారి నిరూపించారు. తాజాగా పీసీ సోషల్ మీడియా వేదికగా పంచుకున్న `ఇండియా డైరీస్` ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. భారతదేశ పర్యటనలో భాగంగా అమ్మ‌డు గడిపిన సాధారణ - ఆహ్లాదకరమైన క్షణాలను ఈ ఫోటోలు ప్రతిబింబిస్తున్నాయి. విలాసవంతమైన హోటళ్లకు భిన్నంగా, అచ్చమైన దేశీ స్టైల్‌లో పీసీ విలువైన‌ సమయాన్ని గడపడం అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ పర్యటనలో ప్రియాంక స్థానిక దాబాలో భోజనం చేస్తూ కనిపించడం విశేషం.

దాల్ మఖానీ, అమృత్‌సరి కుల్చా వంటి వంటకాలను ఎంతో ఇష్టంగా ఆస్వాదిస్తోన్న‌ ఫోటోలు భారతీయ ఆహారంపై ఆమెకున్న మక్కువను చాటుతున్నాయి. విదేశీ వంటకాల కంటే దేశీ మసాలాలు, ఘుమఘుమలాడే పంజాబీ వంటకాలే తనకు నిజమైన తృప్తినిస్తాయని పోస్ట్ లో పేర్కొన్నారు. అంతే కాదు అక్కడ వినిపించే స్థానిక సంగీతం కూడా తన పర్యటనకు మరింత ఉత్సాహ‌న్ని నింపింద‌ని వెల్డించారు. అలాగే ప్రియాంక విశ్రాంతి సమయంలో పాత బాలీవుడ్ చిత్రాలను వీక్షించారు. ముఖ్యంగా అతిలోక సుందరి శ్రీదేవి, సల్మాన్ ఖాన్ నటించిన ఐకానిక్ సినిమాలను చూస్తూ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.

తన ఎదుగుదలలో ఆ సినిమాల ప్రభావం ఎంతగా ఉందో? పీసీ పరోక్షంగా గుర్తు చేసుకున్నారు. గ్లోబ‌ల్ నటిగా ఎదిగినా? తన మూలాలైన బాలీవుడ్ చిత్రాల పట్ల ఆమెకున్న గౌరవం ఫోటోల ద్వారా అర్ద‌మ‌వుతుంది.

ముంబై వీధుల్లో లభించే భేల్ పూరీ గురించి ప్రియాంక ప్రత్యేకంగా ప్రస్తావించారు. న్యూస్‌పేపర్ కోన్‌లో లభించే ఆ అచ్చమైన ముంబై స్ట్రీట్ ఫుడ్ రుచిని తాను ఎంతగా మిస్ అవుతున్నారో? వివరించారు. కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా ముచ్చటించడం, ఇంట్లో వండిన సాధారణ భోజనాన్ని ఆస్వాదించడం వంటివి ఆమెకు ఎంతో మానసిక ప్రశాంతతను ఇస్తాయ‌ని చెప్పుకొచ్చింది.

గ్లోబల్ ఐకాన్‌గా ఎంతో బిజీగా ఉండే పీసీ ఇలాంటి చిన్న చిన్న విషయాల్లోనే అసలైన ఆనందం ఉందని చాటి చెప్పారు. ప్రియాంక చోప్రా షేర్ చేసిన `ఫోటో డంప్` కేవలం పర్యటన విశేషాలే కాదు. ఆమెలోని భారతీయురాలిని మరోసారి ఆవిష్కరించాయి. ఎంత ఎత్తుకు ఎదిగినా? ఒదిగి ఉండటం , దేశ సంస్కృతిని, ఆహారాన్ని గౌరవించడం ఆమె గొప్పతనానికి నిదర్శనం. సినిమాల విష‌యానికి వ‌స్తే `వార‌ణాసి` సినిమాతో అమ్మ‌డు టాలీవుడ్ లోనూ లాంచ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ ని వీడిన త‌ర్వాత అమ్మ‌డు హాలీవుడ్ సినిమాల‌తోనే బిజీ అయిన సంగ‌తి తెలిసిందే. అలాంటి న‌టిని ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి మ‌ళ్లీ భార‌త్ కు తీసుకురావ‌డం విశేషం.

Tags:    

Similar News