• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కాలేజీ రోజుల్లోని...

కాలేజీ రోజుల్లోని తొలిప్రేమను గుర్తు చేసే 'రాజమండ్రి రోజ్‌ మిల్క్' టీజర్..!

By - Tupaki Desk
Update: 2022-10-21 07:30 GMT
ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఫుడ్ ఫేమస్ అవుతుంటాయి. బందరు లడ్డూ - ఆత్రేయపురం పూతరేకులు - కాకినాడ కాజా.. ఇలా వేటికవే ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ఇదే విధంగా రాజమండ్రి రోజ్ మిల్క్ కూడా ఆంధ్రప్రదేశ్ లోని రాజమహేంద్రవరంలో చాలా ఫేమస్. స్వచ్ఛమైన పాలు - సుగంధివేళ్లతో ప్రత్యేకంగా చేసే ఈ రోజ్ మిల్క్‌ కు ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే అంటుంటారు. అంతటి ప్రాచుర్యం పొందిన "రాజమండ్రి రోజ్ మిల్క్" పేరుతో ఇప్పుడు సినిమా వస్తోంది.

సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో జై జాస్తి - అనంతిక జంటగా తెరకెక్కిన చిత్రం 'రాజమండ్రి రోజ్ మిల్క్'. నాని బండ్రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. టైటిల్ తోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ మరియు టైటిల్‌ సాంగ్‌ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రమోషన్స్ లో భాగంగా ఈరోజు (అక్టోబర్ 21) సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

కాలేజ్‌ కి వెళ్లే చైతన్య - కీర్తి అనే యువ జంట మధ్య ప్రేమకథను ఆవిష్కరించిన ఈ టీజర్ ఆకట్టుకుంటోంది. వినోదాత్మకంగా యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన 'రాజమండ్రి రోజ్ మిల్క్' అందరికీ తొలిప్రేమను గుర్తు చేస్తుంది. కాలేజీ రోజుల్లో జరిగిన మరపురాని సంఘటనలను జ్ఞప్తికి తెస్తుంది. ఇందులో వెన్నెల కిషోర్ కీలక పాత్ర పోషించగా.. ప్రవీణ్ - దరహాస్ - వెంకట గణేష్ - హేమంత్ - మధు తదితరులు ఇతరులు సహాయక పాత్రల్లో నటించారు.

'ఎన్నెన్ని కథలో కథనాలో.. ఈ చిలిపి ప్రేమకే..' అంటూ సాగిన నేపథ్య సంగీతం అలరిస్తోంది. అందమైన రాజమండ్రి బ్యాక్ డ్రాప్ లోని విజువల్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. టీజర్ లో కథ ఏంటనేది చెప్పకపోయినా.. ఒక యువ జంట మధ్య హృదయాన్ని కదిలించే ప్రేమకథను చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. జై - అవంతిక జంట ఈ చిత్రానికి ఫ్రెష్ నెస్ ని జోడించారు.

సమ్మర్ లో చల్లటి రోజ్‌ మిల్క్ తాగితే ఎలా ఉంటుందో.. ఇప్పుడు 'రాజమండ్రి రోజ్‌ మిల్క్' టీజర్ కూడా అలాంటి మంచి అనుభూతిని కలిగిస్తుంది. ముఖ్యంగా ఇది యూత్ ని బాగా ఆకట్టుకునేలా ఉంది. కథాంశంలో ఎక్కువగా ట్విస్టులు టర్న్స్ లేకుండా ఒక సాధారణ ప్రేమకథను ఈ సినిమాలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఆత్మ సంతృప్తికరమైన అనుభూతిని పంచుతుందని.. మీ హృదయానికి అవసరమైన ఓదార్పునిస్తుందని చిత్ర బృందం చెబుతోంది.

'రాజమండ్రి రోజ్‌ మిల్క్' చిత్రాన్ని ఇంట్రూప్ ఫిలిమ్స్ సంస్థతో కలిసి సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు. డి.సురేష్‌ బాబు మరియు ప్రదీప్ ఉప్పలపాటి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. గోవింద్ వసంత్ - అజయ్ అరసాడ - యశ్వంత్ నాగ్ మరియు భరత్-సౌరభ్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. ముఖేష్.జి మరియు శక్తి అరవింద్ సినిమాటోగ్రఫీ నిర్వహించారు.

ఇటీవల కాలంలో టాలీవుడ్‌ లో చిన్న సినిమా.. పెద్ద సినిమా అని తేడాలు ఏమి లేవు. ఏడాది పొడవునా అన్ని హై వోల్టేజ్ చిత్రాలు వస్తున్నా.. మంచి కంటెంట్‌ తో వచ్చే సినిమాలు మాత్రమే పెద్ద సినిమాల స్థాయిలో విజయాలు సాధిస్తున్నాయి. స్టార్స్‌ తో సంబంధం లేకుండా హిట్లు కొడుతున్నారు. మరి ఇప్పుడు 'రాజమండ్రి రోజ్‌ మిల్క్' సినిమా కూడా ఆ జాబితాలో చేరుతుందేమో చూడాలి. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Full View

Tags:    
  • RajamundryRoseMilk 
  • Teaser 
  • SureshProductions 
  • Tollywood 
  • VennelaKishore 
  • MovieNews 
  • TupakiNews 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS