సేతుపతిని మిస్‌ చేసుకుని సూపర్‌ స్టార్‌ తప్పు చేశాడు

Update: 2021-02-16 16:30 GMT
తమిళ నటుడు విజయ్‌ సేతుపతి ప్రస్తుతం ఇండియా వ్యాప్తంగా మోస్ట్‌ వాంటెడ్‌ నటుడు మరియు ఎక్కువ మంది అభిమానులను సొంతం చేసుకున్న నటుడిగా పేరు దక్కించుకున్నాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. మాస్టర్‌ మరియు ఉప్పెన సినిమాలతో పాటు అంతకు ముందు విజయ్‌ సేతుపతి నటించిన సినిమాలు ఆయన స్థాయిని ఆకాశమే హద్దుగా పెంచేసింది. ఇంతటి క్రేజ్ ఉన్న విజయ్ సేతుపతిని బాలీవుడ్ సూపర్‌ స్టార్‌ అమీర్ ఖాన్ తన లాల్‌ సింగ్ చద్దా సినిమాలో కీలక పాత్రకు గాను ఎంపిక చేసినట్లుగా ఆ మద్య వార్తలు వచ్చాయి. సినిమా షూటింగ్ ప్రారంభం అయిన తర్వాత సినిమా నుండి డేట్ల క్లాష్ కారణంగా విజయ్‌ సేతుపతిని లాల్‌ సింగ్‌ చద్దా సినిమా నుండి తప్పించారు లేదా తప్పుకున్నాడు అంటూ వార్తలు వచ్చాయి.

లాల్ సింగ్‌ చద్దా సినిమాలో విజయ్‌ సేతుపతి నటించి ఉంటే మరో లెవల్‌ లో ఉండేది. కాని అమీర్‌ ఖాన్ వంటి సూపర్‌ స్టార్ సినిమాలో ఎందుకు నటించేందుకు డేట్లను విజయ్‌ సేతుపతి కుదుర్చుకోలేక పోయాడు అనేది బాలీవుడ్‌ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆ విషయమై కొందరు లోతుగా ఎంక్వౌరీ చేయగా ముందుగా మాట్లాడుకున్న సమయంకు విజయ్‌ సేతుపతి దాదాపుగా 8 కేజీల బరువు పెరగడం వల్ల ఆ పాత్రకు విజయ్‌ సేతుపతి సెట్‌ అవ్వడేమో అనే ఉద్దేశ్యంతో వద్దన్నట్లుగా తెలుస్తోంది. కాని సేతుపతి మాత్రం డేట్లు కుదరక పోవడం వల్ల తప్పుకున్నట్లుగా నింద తన మీద వేసుకున్నాడు. లాల్‌ సింగ్‌ చద్దా సినిమా నుండి విజయ్ సేతుపతిని తప్పించి అమీర్‌ తప్పు చేశాడేమో అంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు.
Tags:    

Similar News