మ‌హేష్ బాబునే భ‌య‌పెట్టిన కిలాడీ

Update: 2020-10-06 05:45 GMT
ఇటీవల విడుద‌లైన చిత్రాల్లో అత్యంత చ‌ర్చ‌నీయాంశంగా మారిన వెబ్ చిత్రం `సోష‌ల్ డైల‌మా` అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయిన ఈ డాక్యుమెంట‌రీ డ్రామా మాన‌వుల‌పై సోష‌ల్ నెట్ ‌వ‌ర్కింగ్ ఏ స్థాయిలో తీవ్ర ప్ర‌భావాన్ని చూపిస్తోందో క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టుగా చూపించారు. సాంకేతిక‌త సృష్టించిన దాని వ‌ల్ల మాన‌వాళికి ఏ స్థాయిలో ముప్పు వాటిల్ల‌నుందో స్ప‌ష్టంగా ఆవిష్కించి స‌గ‌టు మ‌నిషిలో భ‌యాన్ని క‌లిగించారు.

ఇటీవ‌లీ కాలంలో ఈ డాక్యుమెంట‌రీ చిత్రాన్ని చాలా మంది సెల‌బ్రిటీలు వీక్షించారు. ఈ మూవీపై త‌మ అభిప్రాయాల‌ని వ్య‌క్తం చేయ‌డ‌మే కాకుండా భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నామ‌న్నారు. త‌మ భ‌యాన్ని ఈ సంద‌ర్భంగా అభిమానుల‌తో నెటిజ‌నుల‌‌తో పంచుకున్నారు. సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు కూడా ఈ మూవీ చూసి త‌న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు త‌ను చూసిన హార్ర‌ర్ చిత్రాల్లో ఇది అత్యంత భ‌యంక‌ర‌నంగా వుంద‌ని ఈ జాన‌ర్ కి ఫ్యాన్ గా మారిపోయాన‌న్నారు. అంతే కాకుండా ఈ మూవీ గురించి రాస్తున్న‌ప్పుడు ఇప్ప‌టికీ వ‌ణుకు పుట్టిస్తూనే వుంద‌ని ఇది త‌ప్ప‌క చూడాల్సిన చిత్ర‌మ‌ని పేర్కొన్నారు.

మ‌నం గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో ఏం సెర్చ్ చేయ‌బోతున్నాఓ సెర్చ్ ఇంజిన్ కి ముందే తెలిసిపోతోంద‌ని నిపుణులు చెప్పిన‌ప్పుడు అది గూగ‌ల్ సెట్టింగ్ ‌లో ఒక భాగ‌మ‌ని అనుకుంటాం కానీ అది భాగం కాద‌ని మ‌న కార్య‌క‌ళాపాల్ని కొంత మంది  నిశితంగా గ‌మ‌నిస్తున్నార‌ని తెలిస్తే వెన్నులో వ‌ణుకు ప‌ట్టడం ఖాయం. మ‌నం సెర్చ్ చేసేది యాదృచ్చికంగా వ‌చ్చింది అనుకుంటాం. కానీ మ‌న‌ల్ని గ‌మ‌నిస్తున్నారు కాబ‌ట్టే మ‌నం వెతుకుతున్న‌ది మ‌న ముందు ప్ర‌త్య‌ఖ్యం అవుతోంది. మ‌న ఎమోష‌న్స్ ‌ని ఇంట‌ర్నెట్ సోష‌ల్ మీడియా ఎలా ప‌సిగ‌ట్టేస్తోంద‌న్న‌ది యూజ‌ర్స్ ‌కి ఇప్ప‌టికీ అర్థం కావ‌డం లేదు. దీన్నే ప్ర‌ధానంగా తీసుకుని `సోష‌ల్ డైల‌మాలో` చ‌ర్చించార‌ని తెలుస్తోంది.
Tags:    

Similar News